ఘనంగా జియారత్‌ వేడుకలు | Sakshi
Sakshi News home page

ఘనంగా జియారత్‌ వేడుకలు

Published Fri, May 24 2024 10:20 AM

ఘనంగా

కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసులో భాగంగా గురువారం జియారత్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం దర్గాలో ధర్మకర్త సయ్యద్‌ మున్నపాషా వుసేని చిష్తీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతెహాలు, ప్రార్థనలు చేశారు. ధర్మకర్త ఇంటి నుంచి వచ్చిన గంధంను స్వామి సమాధికి పూశారు. అనంతరం స్థానికంగా ఉన్న పక్కీర్లతో ప్రత్యేక ఖవ్వాలి పోటీలను నిర్వహించారు. పక్కీర్లు విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం బ్యాండు మేళాలు, డప్పు వాయిద్యాల మధ్య వారిని కట్టా వద్దకు ఊరేగింపు తీసుకుని వెళ్లి వదిలి వచ్చారు. సలాముల ఆలపన చేశారు. వేడుకల్లో పలువురు పాల్గొన్నారు.

ఘనంగా జియారత్‌ వేడుకలు
1/1

ఘనంగా జియారత్‌ వేడుకలు

Advertisement
 
Advertisement
 
Advertisement