Sakshi News home page

రోషన్‌అలీకి ‘లైఫ్‌టైమ్‌’ అవార్డు

Published Thu, Nov 9 2023 1:12 AM

- - Sakshi

11న విజయవాడలో

ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేత

కర్నూలు (న్యూటౌన్‌): ముస్లిం మైనారిటీల హక్కుల సాధనకు కృషి చేస్తున్న రిటైర్డ్‌ తహసీల్దార్‌ సయ్యద్‌ రోషన్‌అలీ ఏపీ స్టేట్‌ ఉర్దూ అకాడమీ అందజేస్తున్న లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 11వ తేదీన విజయవాడలో ఇందిరాగాందీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ విద్యార్థులకు విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పన కోసం తాను కృషి చేసినట్లు చెప్పారు. కర్నూలులో డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు కోసం శ్రమించానన్నారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ శ్రామ్‌కు దరఖాస్తు చేసుకోండి

కర్నూలు(రాజ్‌విహార్‌): అసంఘటిత కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ శ్రామ్‌ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కర్నూలు కార్మిక శాఖ సహాయాధికారి కేశన్న బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అర్హులు సమీపంలోని సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

What’s your opinion

Advertisement