మాస్టర్‌ ప్లాన్‌ పనులు వేగవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ ప్లాన్‌ పనులు వేగవంతం చేయాలి

Published Fri, May 10 2024 10:25 PM

మాస్టర్‌ ప్లాన్‌ పనులు వేగవంతం చేయాలి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఈఓ కె.ఎస్‌.రామరావు ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా మహామండపం పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఈఓ గురు వారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనకదుర్గా నగర్‌ నుంచి మహామండపానికి వరకు చేపట్టిన ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణానికి చేస్తున్న పునాదుల నిర్మాణ పనుల గురించి ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించారు. అనంతరం గోశాల వద్ద నిర్మిస్తున్న అన్నదాన భవనం, ప్రసాదాల పోటు నిర్మాణ పనులపై ఈఈ ఎల్‌.రమాదేవితో చర్చించారు. అన్నదాన భవనం పునాదుల కోసం జరుగుతున్న రాడ్‌బెండింగ్‌ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు తొలుత పునాదుల నిర్మాణం కీలకమని, పనుల పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వేసవి సెలవులు, ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉండే సమయం కావడంతో పనులను మరింత వేగంగా చేపట్టేందుకు వీలు కలుగుతుందని ఆలయ ఈవో ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ఈవో వెంట దేవస్థాన ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement