సత్తుపల్లి కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి | - | Sakshi
Sakshi News home page

సత్తుపల్లి కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి

Published Sat, Jun 22 2024 12:10 AM | Last Updated on Sat, Jun 22 2024 12:10 AM

సత్తుపల్లి కోర్టును  సందర్శించిన జిల్లా జడ్జి

సత్తుపల్లి కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లి కోర్టు సముదాయాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తేళ్లూరి ఆడమ్స్‌, న్యాయాధికారులతో కలిసి కోర్టు పరిసరాలను పరిశీలించారు. కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు అవసరమైన బార్‌ రూమ్‌, టాయిలెట్లు, పార్కింగ్‌ షెడ్‌, క్యాంటీన్‌ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ ఈఈ హేమలత, జేఈ నాగేశ్వరరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరో అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీనివాస్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి షేక్‌ మీరా ఖాసీం సాహెబ్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి వి.లావణ్య, న్యాయవాదులు పి.జానకీరామారావు, బుజ్జీ సాహెబ్‌, లక్ష్మణరావు, కొండపల్లి విజయ్‌కుమార్‌, అబ్ధుల్‌బాషా, కృష్ణప్రసాద్‌, వెంకటకృష్ణ పాల్గొన్నారు. కాగా, సత్తుపల్లికి వచ్చిన జిల్లా జడ్జిని ఆర్యవైశ్య సంఘం, వాసవీక్లబ్‌ ప్రతినిధులు వందనపు సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీధర్‌, పసుమర్తి గోపాలరావు, పురుష్తోతం, గుండు ఉమ, పోకూరి కృష్ణప్రసాద్‌, సత్తిబాబు, ఆదినారాయణ, శ్రీనివాసరావు, నరేష్‌, సత్యనారాయణ సన్మానించారు.

నీలాద్రీశ్వరాలయంలో పూజలు

పెనుబల్లి: పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వరాలయాన్ని శుక్రవారం జిల్లా జడ్జి రాజగోపాల్‌ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా జిల్లా జడ్జి, ఇతర న్యాయమూర్తులకు ఆలయ కమిటీ ఛైర్మన్‌ చీకటి నర్సింహారావు, ఈఓ పాకాల వెంకటరమణ స్వాగతం పలికి పూజలు చేయించారు. వివిధ కోర్టుల న్యాయమూర్తులు మారగాని శ్రీనివాసరావు, ఖాసీం, లావణ్య, జిల్లా కోర్టు ఏఓ హరికృష్ణ, ఉద్యోగులు వనమా లక్ష్మణ్‌, లాజర్‌, శ్యామ్‌ త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి కట్టడికి

చర్యలు తీసుకోవాలి

వీసీలో పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌

ఖమ్మంక్రైం: జిలాల్లో గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదేశించారు. కమిషనరేట్‌ నుంచి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, పెండింగ్‌ కేసులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. అంతేకాక రైళ్లు, ఇతర రవాణా మార్గాలపైనా స్ధానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దృష్టి సారించాలని సూచించారు. విక్రయదారులు మొదలు వినియోగదారుల వరకు డేగ కన్ను వేయాలని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు, విద్యార్థులను స్మగ్లర్లు లక్ష్యంగా ఎంచుకుంటున్నందున నిఘా పెంచాలని తెలిపారు. కళాశాలల్లోకి విష సంస్కృతి ప్రవేశిస్తే త్వరగా విస్తరించనున్నందున ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, డ్రగ్స్‌ వాడకంతో దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సీపీ సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌బీ ఏసీపీ ప్రసన్నకుమార్‌, సీఐలు స్వామి, రామకృష్ణ పాల్గొన్నారు.

రేపు ఒలింపిక్‌ డే రన్‌

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా యువజన, క్రీడల శాఖ, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఈనెల 23వ తేదీన ఒలింపిక్‌ డే రన్‌ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పుట్టా శంకరయ్య, కె.క్రిస్టోఫర్‌బాబు తెలిపారు. ఒలింపిక్‌ క్రీడల ఆవశ్యకతను వివరించేలా జిల్లా కేంద్రంలోని సర్థార్‌ పటేల్‌ స్టేడియంలో ఈ రన్‌ ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం జరిగే రన్‌లో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు ఓ ప్రకటనలో కోరారు.

తపాలా శాఖలో

ఎల్‌ఎస్‌జీలకు ఉద్యోగోన్నతి

ఖమ్మంగాంధీచౌక్‌: తెలంగాణ తపాలా సర్కిల్‌ కార్యాలయం పరిధిలో 120 మంది లోయర్‌ సెలక్షన్‌ గ్రేడ్‌(ఎల్‌ఎస్‌జీ) పోస్టుమాస్టర్లకు హెచ్‌ఎస్‌జీ–2లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ విద్యాసాగర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 11 మందికి ఉద్యోగోన్నతి లభించింది. ప్రతీ ఆరేళ్లకోసారి నిర్వహించే ఉద్యోగోన్నతుల్లో భాగంగా పలువురికి ప్రస్తుతం పనిచేస్తున్న డివిజన్లలోనే పోస్టింగ్‌ దక్కగా, కొందరికి స్థానచలనం తప్పలేదు. ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌లో ఎన్‌.ఆదిలక్ష్మి, ఎన్‌వీఎల్‌.ప్రసన్న, పి.అంజయ్య, పి.యలమంద, వి.వెంకయ్య, బి.వెంకన్న, కె.శ్రీరాం, కె.పాపయ్య ఇక్కడే పోస్టింగ్‌ లభించగా, టి.రూబెన్‌, పి.స్వామి, ఎండీ.ఫిరోజ్‌ఖాన్‌ బదిలీ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement