● అలాంటి పోలీసు అధికారులపై సీపీ సీరియస్‌ ● పెనుబల్లి సర్కిల్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడే అవకాశం | - | Sakshi
Sakshi News home page

● అలాంటి పోలీసు అధికారులపై సీపీ సీరియస్‌ ● పెనుబల్లి సర్కిల్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడే అవకాశం

Published Sat, Jun 22 2024 12:10 AM | Last Updated on Sat, Jun 22 2024 12:10 AM

-

దందాలకు

కొమ్ము కాస్తే అంతే..

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో పేకాట, గంజాయి సరఫరా, గేమింగ్స్‌ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కొమ్ముకాసే పోలీసు ఉద్యోగులపై కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సత్తుపల్లి సబ్‌ డివిజన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సీపీ పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పెనుబల్లి సర్కిల్‌ అధికారిపై మల్టీ జోన్‌ ఐజీకి నివేదిక పంపారని తెలిసింది. అయితే సదరు సర్కిల్‌ అధికారి వ్యవహార శైలి, అసలు సత్తుపల్లి సబ్‌ డివిజన్‌లో ఏం జరిగిందనే దానిపై పోలీస్‌ ఉన్నతాధికారులు మరింత లోతుగా ఆరా తీస్తుండడంతో నివేదిక ఆధారంగా ఆ అధికారి పై సస్పెన్షన్‌ వేటు పడే అవకాశమున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం టూ టౌన్‌లో పనిచేసిన అధికారిపై కూడా ఇటీవల మల్టీ జోన్‌ ఐజీకి నివేదిక అందింది. పలువురిపై తప్పుడు కేసులు పెట్టారని వచ్చిన ఫిర్యాదులతో విచారణ చేయించిన సీపీ నివేదిక సమర్పించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement