నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి

Published Sat, May 25 2024 12:05 AM

నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి

జమ్మికుంట: వానాకాలంలో రైతులు నకిలీ విత్తానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని హుజూరాబాద్‌ డివిజన్‌ ఏసీపీ శ్రీనివాస్‌జీ అన్నారు. పట్టణంలోని ఫర్టిలైజర్‌ షాపులను వ్యవసాయశాఖ ఏవో గోవర్దన్‌రెడ్డి, సీఐ వరగంటి రవితో కలిసి శుక్రవారం సందర్శించారు. అకౌంట్‌ రిజిస్టర్‌, ఇన్‌వాయిస్‌, కంపెనీ కొనుగోలు రశీదులుతోపాటు పలు అంశాలపై తనిఖీలు చేపట్టారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవాలని, తక్కువ ధరక వస్తున్నాయనే ఆశతో నకిలీ విత్తనాలు కొంటే పంట దిగుబడి తగ్గడంతోపాటు ఆర్థికంగా నష్టపోతారని, నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉందని, రైతులు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని, నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌, వ్యవసాయ అధికారులు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌ డివిజన్‌ ఏసీపీ శ్రీనివాస్‌జీ

Advertisement
 
Advertisement
 
Advertisement