నిమిషం ఆలస్యమైనా ఇంటికే.. | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యమైనా ఇంటికే..

Published Thu, May 23 2024 12:35 AM

నిమిషం ఆలస్యమైనా ఇంటికే..

● డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి

కరీంనగర్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 31 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ఫస్టియర్‌ 10,073, సెకండియర్‌ 4,907 మొత్తం 14,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, సాంకేతిక పరికరాలను అనుమతించరని తెలిపారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, కేంద్రాల సమీపంలో జరిగే ప్రతి ఫోన్‌ సంభాషణ రికార్డు అవుతుందని ఇన్విజిలేటర్లు, విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, సమీపంలో జిరాక్స్‌ సెంటర్లను మూసివేసి ఉంచాలని ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు. సలహాలు, సూచనల కోసం ట్రోల్‌ఫ్రీ 14416, 1800–914416 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement