మద్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

మద్యం పట్టివేత

Published Tue, Nov 21 2023 12:40 AM

మద్యం బాటిళ్లను చూపుతున్న పోలీసులు 
 - Sakshi

జమ్మికుంట(హుజూరాబాద్‌): పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 6.3 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ అక్బర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. హుజూరాబాద్‌ మండలంలోని పోతిరెడ్డిపేటకు చెందిన అంబటి రమేశ్‌ సోమవారం జమ్మికుంట పట్టణానికి వచ్చి, బైక్‌పై మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాటిని సీజ్‌ చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రమాదేవి, హెడ్‌ కానిస్టేబుల్‌ ఐలయ్య, కానిస్టేబుళ్లు విశ్వజ్ఞ, రేణుక, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌ క్రైం: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు కరీంనగర్‌ వన్‌ టౌన్‌ ఎస్‌ఐ స్వామి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నగరంలోని కోతిరాంపూర్‌కు చెందిన లకావత్‌ ఈర్య కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మద్యం దుకాణాల నుంచి కొంత మద్యం కొనుగోలు చేసి, ఇంట్లో నిల్వ ఉంచి, తెలిసిన వారికి విక్రయిస్తున్నాడు. పోలీసులు సోమవారం పక్కా సమాచారంతో వెళ్లి, అతను మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నారు. రూ.1,240 విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, ఈర్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మానకొండూర్‌: మండలంలోని అన్నారంలో గల వైన్స్‌ నుంచి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. వెల్ది గ్రామానికి చెందిన మహంకాళి మహేశ్‌ సోమవారం అన్నారం వైన్స్‌ నుంచి 4 మద్యం బాటిళ్ల కాటన్లను బైక్‌పై తీసుకెళ్తున్నాడు. లలితాపూర్‌ శివారులో ఎన్నికల ఫ్లయింగ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపడుతూ అతన్ని పట్టుకున్నారు. మద్యం బాటిళ్లను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాజ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement