నేటి నుంచి ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూజలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూజలు

Published Thu, Apr 18 2024 10:25 AM

ధ్వజస్తంభం మొదలు భాగంలో చేసిన రాగి రేకు తాపడం  - Sakshi

అన్నవరం: సత్యదేవుని ఆలయంలో నూతన స్వర్ణ ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించేందుకు యాగశాల నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ధ్వజస్తంభం కర్రను స్వామివారి ఆలయంలోని అనివేటి మండపం వద్దకు చేర్చారు. దానిని నిలబెట్టేందుకు కాంక్రీట్‌తో పునాదిని సిద్ధం చేశారు. మంటపం శ్లాబ్‌ నుంచి ధ్వజస్తంభం వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.

22న ప్రతిష్ఠాపన

నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠకు సంబంధించి గురువారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకూ ప్రత్యేక పూజలు చేస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు వినాయక పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, మండపారాధన, జలాదివాసం నిర్వహిస్తారు. శుక్రవారం క్షీరాదివాసం, శనివారం పుష్పాదివాసం, ఆదివారం ధాన్యాదివాసం, 22వ తేదీ కలాన్యాశం, శయ్యాదివాసం తదితర పూజలు నిర్వహిస్తారు. అనంతరం 22వ తేదీ ఉదయం 10.48 గంటలకు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆ తర్వాత స్తంభానికి రాగి రేకు అమర్చి స్వర్ణ రేకు తాపడం చేయనున్నారు. ఇందుకయ్యే ఖర్చంతా నెల్లూరుకు చెందిన భక్తుడి కుటుంబ సభ్యులు భరిస్తున్న సంగతి తెలిసిందే.

ఽయాగశాలలో ప్రత్యేక హోమాలు

ఽసత్యదేవుని ఆలయంలో పూర్తయిన ఏర్పాట్లు

Advertisement
Advertisement