పోటీల్లో క్రీడా స్ఫూర్తి చాటాలి | Sakshi
Sakshi News home page

పోటీల్లో క్రీడా స్ఫూర్తి చాటాలి

Published Fri, Dec 15 2023 12:56 AM

లాంగ్‌జంప్‌ చేస్తున్న విద్యార్ధి   - Sakshi

గద్వాల అర్బన్‌: గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని డీవైఎస్‌ఓ బీఎస్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడీయంలో అండర్‌–14, 16 విభాగాల్లో ఇంటర్‌ డిస్ట్రిక్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. ముందుగా ఆయన జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. బాల బాలికలకు గ్రూపులవారీగా పరుగు పందెం, 600మీటర్స్‌ లాంగ్‌ జంప్‌, హైజంప్‌, షాట్‌ఫుట్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 320మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చాటిన క్రీడాకారులకు మెడల్స్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీవైఎస్‌ మాట్లాడుతూ.. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో పోటీల పరిశీలకులు రమణ, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జితేందర్‌, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బీసన్న, సతీష్‌కుమార్‌, కృష్ణయ్య, భరత్‌కుమార్‌, నగేష్‌బాబు, రజనికాంత్‌, జగదీష్‌, ఆనంద్‌కుమార్‌, నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు.

డీవైఎస్‌ఓ బీఎస్‌ ఆనంద్‌

ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌

ఎంపిక పోటీలు

గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్‌ 
అందజేస్తున్న ఆనంద్‌
1/1

గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్‌ అందజేస్తున్న ఆనంద్‌

Advertisement
Advertisement