20న వస్తువుల వేలం | Sakshi
Sakshi News home page

20న వస్తువుల వేలం

Published Fri, Dec 15 2023 12:56 AM

- - Sakshi

గద్వాల క్రైం: గద్వాల, ఆదోని కార్గో పార్సిల్‌, కోరియర్‌ కౌంటర్‌లో మిగిలిపోయిన వస్తువులను ఈ నెల 20వ తేదిన బహిరంగ వేలం వేయనున్నట్లు గద్వాల డిపో మేనేజర్‌ మంజులారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బైక్‌ స్పెర్‌ పార్ట్స్‌, ఫర్టిలైజర్‌, బుక్స్‌, పోస్టర్స్‌, మెడికల్‌ బాక్స్‌లను వేలం వేయనున్నట్లు, మరిన్ని వివరాలకు సెల్‌ నం.9676640066 సంప్రదించాలని తెలిపారు.

29న వాహనాలు..

గద్వాల క్రైం: వివిధ కేసుల సందర్భంగా సీజ్‌ అయిన వాహనాలను ఈ నెల 29న బహిరంగ వేలం ద్వారం విక్రయించనున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి పురుషోత్తంరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనదల్చి వారు దరఖాస్తుకు రూ.500, డిపాజిట్‌కు రూ.5వేల డిడి, సెక్రటరీ ఆర్‌టీఏ జోగుళాంబ గద్వాల జిల్లా పేరు మీద చెల్లించాలని, మరిన్ని వివరాల కోసం జిల్లా రావాణాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

వేలం ద్వారా ఆలయానికి రూ.57.44లక్షల ఆదాయం

గద్వాల అర్బన్‌: జిల్లా కేంద్రంలో జమ్మిచేడులోని జములమ్మ, పరుశరామస్వామి ఆలయంలో గురువారం ఎండోమెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వరమ్మ, ఆలయ ఈఓ పురేందర్‌ కుమార్‌ ఆఽధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. 12నెలల పాటు టెంకాయలు, ప్రసాదం, లడ్డు, పులిహోర విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ, అమ్మవారి చీరల సేకరణ, టెండర్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో పెద్ద ఎత్తున పోటీదారులు పాల్గొన్నారు. టెంకాయల వేలంలో తొమ్మిది మంది పాల్గొనగా.. జిల్లా కేంద్రానికి చెందిన పులిపాటి నాగేష్‌ రూ.44.35లక్షలకు దక్కించుకున్నాడు. అదేవిధంగా కొబ్బరి చిప్పల సేకరణ వేలంలో తొమ్మిది మంది పాల్గొనగా కుర్వ అనిల్‌ రూ.6.67లక్షలకు కై వసం చేసుకున్నారు. ఇక ఆలయ ఆవరణలో పులిహోర, లడ్డు ప్రసాదం విక్రయించే వేలం పాటలో నల్గురు పాల్గొనగా.. రూ.6.41లక్షలకు రాకేష్‌ దక్కించుకున్నారు. మొత్తంగా వేలం ద్వారా రూ.57.45లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా అమ్మవారి చీరల సేకరణ టెండర్‌ నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు మాత్రమే డీడీ కట్టారు. నిబంధనల ప్రకారం ముగ్గురు ఉంటేనే వేలం నిర్వహిస్తామని ఈఓ పేర్కొంటూ వేలం వాయిదా వేశారు. టెండర్‌ దక్కించుకున్న వారికి వచ్చే నెల 1తేదీ నుంచి టెండర్లు అమలులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఓం ప్రకాష్‌ కామ్లే, శంకర్‌తో పాటు మురళీధర్‌ రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాష్‌, రాజలింగం తదితరులు ఉన్నారు.

రేపు ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లా చెస్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఈనెల 16న స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి జిల్లా అండర్‌–14, అండర్‌–17 విభాగం బాలబాలికల చెస్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్‌బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని, ఐదు జిల్లాల జట్ల క్రీడాకారులు పాఠశాల ఒరిజనల్‌ బోనఫైడ్‌, ఆధార్‌కార్డుతో హాజరుకవాలని కోరారు. మిగతా వివరాల కోసం 99661 37908, 70130 72546 సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement