ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి

Published Fri, Dec 15 2023 12:56 AM

-

గద్వాల అర్బన్‌: జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టుకు యాసంగి పంటకుగాను సాగు నీరు విడుదల చేయాలని తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు ద్వారా యాసంగి పంట సాగుకు నీరు విడుదల చేస్తారా లేదా అనే దానిపై రైతులకు నేటికీ స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఎడమ కాల్వ కింద 35వేల ఎకరాల ఆయకట్టు సాగు అవుతున్నదని, సాగు నీరు విడుదల చేయకపోతే ప్రభుత్వం క్రాప్‌ హాలీడే ప్రకటించాలని, వర్షాలు లేక పంటలు నష్టపోయిన రైతులకు సైతం రూ.25వేల పరిహారం ఇవ్వాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైతాంగ సమితి జిల్లా అధ్యక్షుడు ఖాజామైనుద్దీన్‌, ప్రధాన కార్యదర్శి సత్యారెడ్డి, రైతులు మల్లికార్జున్‌, భాస్కర్‌ రెడ్డి, పాండు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement