మొదటి విడత ర్యాండమైజేషన్‌ పూర్తి

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌  - Sakshi

భూపాలపల్లి: వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణలో పోలింగ్‌ విధులు కేటాయింపునకు సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేసినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భవేష్‌మిశ్రా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్‌ విధుల నిర్వహణకు సిబ్బంది మొదటిదశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా భవేష్‌మిశ్రా మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 275 పోలింగ్‌ కేంద్రాలు, మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి 130 పోలింగ్‌ కేంద్రాలు, ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఐదు పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది ర్యాండమైజేషన్‌ మొదటి దశ పూర్తి చేసినట్లు చెప్పారు. భూపాలపల్లి రెవెన్యూ జిల్లా పరిధిలోని మొత్తం 410 పోలింగ్‌ కేంద్రాలకు ప్రిసైడింగ్‌, సహాయక ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీల కేటాయింపునకు మొదటి విడత ర్యాండమైజేషన్‌ నిర్వహించినట్లు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం 20శాతం సిబ్బందిని అదనపు కేటాయింపు ప్రక్రియ చేపట్టామన్నారు. జిల్లాలో మొత్తం 490మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 624మంది సహాయక ప్రిసైడింగ్‌ అధికారులు, 1064 మంది ఓపీఓల కేటాయింపును ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు ఎన్‌ఐసీ ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌లో పారదర్శకంగా ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలకు తగు ఏర్పాట్లు

ధాన్యం కొనుగోలు కోసం 189కేంద్రాలు

కలెక్టర్‌ భవేష్‌మిశ్రా

Election 2024

Read latest Jayashankar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top