Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించాలి

Published Tue, Apr 16 2024 1:05 AM

- - Sakshi

జిల్లా వైద్యాధికారి హరీశ్‌రాజ్‌

జనగామ రూరల్‌: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి.. కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్‌ హరీశ్‌రాజ్‌ అన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గెజిటెడ్‌ అధికారులు తమ సిబ్బంది నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారి రవీందర్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, భాస్కర్‌, సంఘం జిల్లా అధ్యక్షుడు రహెమాన్‌, జైపాల్‌రెడ్డి, రఫీక్‌, వెంకట్‌, స్వామి, ప్రభాకర్‌, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అవగాహనతో

ప్రమాదాల నివారణ

జనగామ రూరల్‌: అవగాహనతోనే విద్యుత్‌ ప్రమాదాలను నివారించవచ్చని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ టి.వేణుమాధవ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో విద్యుత్‌ ప్రమాదాల నివారణపై కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులకు ఏర్పా టు చేసిన అవగాహన సదస్సులో ఆయన మా ట్లాడారు. భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరగవని, తప్పనిసరిగా కోఆర్డినేషన్‌ చేసుకోవాలని సూచించారు. సీనియర్‌ ఉద్యోగు ల అనుభవాలను పరిగణలోకి తీసుకుని పనులు చేట్టాలన్నారు. కార్యక్రమంలో డీఈ లక్ష్మీనా రాయణ, విజయ్‌కుమార్‌, మర్రెడ్డి, ఇన్‌చార్జ్‌ డీఈటీ ప్రభావతి, అకౌంట్స్‌ అధికారి జయరా జు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌

ఇన్‌చార్జ్‌గా ప్రవీణ్‌

జనగామ: కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఓబీసీ సెల్‌ ఇన్‌చార్జ్‌గా జనగామ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ లోకుంట్ల ప్రవీణ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడు తూ ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి, ఓబీసీ సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

టూరిజం కోర్సులకు

దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌ : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటల్‌ మెనేజ్‌మెంట్‌(నిధమ్‌) గచ్చిబౌలిలో టూరిజం కోర్సులు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం శాఖ అధికారి బి.వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ కోర్సులు చేసిన వారు అర్హులని, కోర్సు పూర్తి చేసిన వారికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌తో పాటు దేశంలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో అవకాశాలు లభిస్థాయని పేర్కొన్నారు. మరిన్ని వివరా లకు 94408 16076, 98669 19131 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఎన్నికల కంట్రోల్‌ రూం ఏర్పాటు

జనగామ రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో జనగామ నియోజకవర్గ పరిధి ఎన్నికల సమాచారం కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ కొమురయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 90323 86961 నంబర్‌కు ఫోన్‌ చేసి ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందవచ్చని, 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

అసోసియేషన్‌ ప్రధాన

కార్యదర్శిగా సులేమాన్‌

జనగామ రూరల్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల అడ్మిస్ట్రేటివ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లా కేంద్రంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల ఏఓ ఎండీ.సులేమాన్‌ అహ్మద్‌ ఎన్నికయ్యారు. సోమవారం హైదరా బాద్‌ నాంపల్లిలోని కార్యాలయంలో రాష్ట్ర బాడీ ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న సులేమాన్‌కు కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement