ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

Published Thu, Nov 9 2023 1:54 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ శివలింగయ్య - Sakshi

జనగామ రూరల్‌: ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిధి మూడు నియోజకవర్గాల ఎన్ని కల సిబ్బందికి అవసరమైన శిక్షణ తరగతులు ఇప్పటికే విడతల వారీగా నిర్వహించామని చెప్పారు. నోడల్‌ అధికారులకు మాస్టర్‌ ట్రైనర్ల చేత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌, సీయూ, బీయూ, వీవీ ప్యాట్ల నిర్వహణపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నా రు. ఎన్నికలకు సంబంధించి ప్రతి పనిని జాగ్రత్తగా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. నోడల్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సహాయ అధికా రి సుహాసిని, నోడల్‌ అధికారులు ఇస్మాయిల్‌, వినోద్‌కుమార్‌, రంగాచారి, అనిల్‌కుమార్‌, మొగులప్ప, కొండల్‌రెడ్డి, చంఽద్రశేఖర్‌, డాక్టర్‌ ప్రశాంత్‌, రాజేందర్‌రెడ్డి, ఏఓ రవీందర్‌ పాల్గొన్నారు.

ప్రతీ వాహనం తనిఖీ చేయాలి

తరిగొప్పుల: ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి.. వాహనాలన్నింటినీ తనిఖీ చేయాలని డీసీపీ సీతారాం అన్నారు. మండలకేంద్రం శివారు ఎన్యానాయక్‌ తండా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును ఆయన బుధవారం సందర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, డబ్బు తరలించేందుకు అవకాశం ఉన్న తరుణంలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు. వాహనదారులు సైతం సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్సై దూదిమెట్ల నరేష్‌, స్టాటిస్టికల్‌ నిఘా బృందం ఇన్‌చార్జ్‌ మిస్బాఅలాం ఉన్నారు.

సమీక్షలో కలెక్టర్‌ శివలింగయ్య

Advertisement

తప్పక చదవండి

Advertisement