చైతన్యంతోనే కుల సంఘాలు బలోపేతం | Sakshi
Sakshi News home page

చైతన్యంతోనే కుల సంఘాలు బలోపేతం

Published Sat, Apr 20 2024 1:55 AM

యాదవసంఘం భవనాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌  - Sakshi

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌(వేములవాడ): ప్రజలు చైతన్యంగా ఉంటేనే కుల సంఘాలు బలోపేతమవుతాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం కథలాపూర్‌ మండలం పెగ్గెర్ల గ్రామంలో యాదవసంఘం భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. సంఘ భవనం కోసం ప్రభుత్వం నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. అనంతరం విప్‌ను యాదవ సంఘం సభ్యులు సన్మానించారు. కాంగ్రెస్‌ నాయకులు కాయితి నాగరాజు, పులి హరిప్రసాద్‌, పాల్తెపు గంగారాం, కారపు గంగాధర్‌, మార్గం శ్రీనివాస్‌, గంగమల్లయ్య, గంగాధర్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనంగా తూకం వేస్తున్న విషయాలపై మండలంలోని భూషణరావుపేట, పెగ్గెర్ల గ్రామాల రైతులు విప్‌ ఆదికి వినవ్నించారు. 40 కిలోల బస్తాకు అదనంగా కిలోన్నర, రెండు కిలోలు తూకం వేస్తేనే రైస్‌మిల్లర్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా విప్‌ జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. మిల్లర్లతోపాటు రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.

Advertisement
Advertisement