రూ.1.50 లక్షలు పట్టివేత | Sakshi
Sakshi News home page

రూ.1.50 లక్షలు పట్టివేత

Published Fri, Nov 17 2023 1:26 AM

నగదు చూపుతున్న ఎస్‌ఐ సవీన్‌కుమార్‌
 - Sakshi

మెట్‌పల్లి: పట్టణంలోని వెంకట్రావ్‌పేట శివారులో పోలీసులు గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ వ్యక్తి కారులో ఎలాంటి పత్రాలు లేకుండా రూ.1.50 లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఆ మొత్తాన్ని గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు.

రామాజీపేట శివారులో రూ.68 వేలు

రాయికల్‌: మండలంలోని రామాజీపేట శివారులో గురువారం సాయంత్రం ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి వద్ద రూ.68 వేలు పట్టుకున్నారు. సంబంధిత పత్రాలు చూపించకపోవడంతో సీజ్‌ చేసి, గ్రీవెన్స్‌ సెల్‌కు అప్పగించినట్లు తెలిపారు.

ఒబులాపూర్‌ చెక్‌పోస్టు వద్ద రూ.80 వేలు

మల్లాపూర్‌: మండలంలోని ఒబులాపూర్‌ చెక్‌పోస్టు వద్ద గురువారం ఓ కారులో తరలిస్తున్న రూ.80 వేలను పట్టుకున్నట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి కారులో నగదు తీసుకెళ్తూ పట్టుబడ్డాడని అన్నారు. సంబంధిత పత్రాలు చూపించకపోవడంతో సీజ్‌ చేసి, గ్రీవెన్స్‌ సెల్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుళ్లు ఉన్నారు.

బస్సు ఎక్కుతుండగా

ఆభరణాలు చోరీ

జగిత్యాల రూరల్‌: ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వంజరివాడకు చెందిన రమణయ్య బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి నిజామాబాద్‌ వెళ్లేందుకు స్థానిక కొత్త బస్టాండ్‌కు వెళ్లాడు. ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా దొంగలు రూ.2.80 లక్షల విలువైన ఆభరణాలున్న ఆయన బ్యాగును చోరీ చేశారు. బాధితుడు గురువారం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అబ్దుల్‌ రహీం తెలిపారు.

కుక్కల దాడిలో

11 మందికి గాయాలు

ధర్మపురి: కుక్కల దాడిలో 11 మందికి గాయపడ్డారు. ధర్మపురిలోని గంగపుత్ర కాలనీలో గురువారం కుక్కలు గుంపుగా సంచరించాయి. స్థానికులైన నాగుల సుధ, గరిగె రోషన్‌, కన్నారి వర్ష, ప్రణీష్‌ తదితరులపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వర్ష, ప్రణీష్‌లను స్థానికులు అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగతావారికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. కుక్కల బారినుంచి తమను కాపాడాలని మున్సిపల్‌ అధికారులను కోరుతున్నారు.

ఆస్పత్రికి వెళ్లి వస్తున్న బాధితులు
1/1

ఆస్పత్రికి వెళ్లి వస్తున్న బాధితులు

Advertisement
Advertisement