Candida Auris Fungus: Scientists Warns Candida Auris Fungus Dangerous | కోవిడ్‌ కంటే మరింత ప్రమాదకరం - Sakshi
Sakshi News home page

కోవిడ్‌ కంటే మరింత ప్రమాదకరం: శాస్త్రవేత్తలు

Published Tue, Feb 2 2021 8:06 PM

Scientists Warns Candida Auris Fungus Dangerous Than Covid 19 - Sakshi

లండన్‌: మహమ్మారి కరోనా దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలమైంది. భారత్‌ సహా కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైనప్పటికీ... కోవిడ్‌-19 భయాల నుంచి ఇప్పటికీ కొందరు తేరుకోలేపోతున్నారు. మరోవైపు కొన్నిచోట్ల టీకా తీసుకున్న వాళ్లలో కొంతమంది అనూహ్యంగా మృతి చెందుతుండటంతో వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసే మరో వార్త చెప్పారు. ‘‘క్యాండిడా ఆరిస్‌’’ అనే ఫంగస్‌ కోవిడ్‌ కంటే కూడా ఎన్నోరెట్లు ప్రమాదకరమైనదని హెచ్చరించారు.(చదవండి: వూహాన్‌ మార్కెట్లో డబ్ల్యూహెచ్‌ఓ బృందం)

ఇది గనుక రక్తంలోకి ప్రవేశిస్తే, ఎలాంటి విరుగుడుకు లొంగదని, ప్లేగు తరహాలో వ్యాపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్యాండిడా ఆరిస్‌ బారిన పడితే బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, వ్యాప్తి మొదలైతే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని తీవ్ర హెచ్చరికలు చేశారు. 2016లోనే ఇంగ్లండ్‌లో దీని ఆనవాలు గుర్తించామని, ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగల సామర్థ్యం దీనికి ఉంటుందని తెలిపారు. కోతుల ద్వారా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎపిడెమిలాజిస్ట్‌ జొహాన్న రోడ్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement