ఇరాన్‌ యుద్ధం.. అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు! | US-Israel-Iran War Live Updates On Apr 5th 2026 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌ యుద్ధం.. అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు!

9 బాలిస్టిక్, ఒక క్రూయిజ్ క్షిపణితో దాడికి యత్నం

  • యూఏఈపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
  • 9 బాలిస్టిక్ క్షిపణులు, ఒక క్రూయిజ్ క్షిపణితో దాడికి యత్నం
  • 50 డ్రోన్లను కూడా పంపిన ఇరాన్‌ సైన్యం
  • వాటన్నింటినీ అడ్డుకున్నామని యూఏఈ ప్రకటన
     
2026-04-05 16:44:56

యూఏఈలోని పెట్రోకెమికల్స్ ప్లాంట్‌పై ఇరాన్‌ దాడి

యూఏఈపై కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు
యూఏఈలోని పెట్రోకెమికల్స్ ప్లాంట్‌పై ఇరాన్‌ దాడి
భారీగా ఎగిసిపడ్డ మంటలు.. దట్టంగా అలుముకున్న పొగలు
 

2026-04-05 14:56:45

అమెరికాకు మరో షాక్‌..

  • అమెరికాకు మరో షాక్‌..
  • ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
  • అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి.
  • అదే సమయంలో ఇరాన్ కూడా అంతే రీతిలో బదులిస్తోంది.
  • అందుకే యుద్ధం 37వ రోజుకు చేరుకున్నా, ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత రావడం లేదు.
  • F-15E ఫైటర్‌ జెట్‌ పైలట్‌ కోసం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న మరో విమానాన్ని కూల్చినట్లు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ పేర్కొంది.
  • ఇస్ఫహాన్‌ దక్షిణ భాగంలో ఈ ఘటన జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
  • విమానం కూలడంతో దట్టమైన పొగలు అలుముకున్న ఫొటోలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి.
2026-04-05 12:16:09

అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక..

  • అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక..
  • అమెరికా, ఇజ్రాయెల్‌కు త్వరలోనే వారికి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నామని ఇరాన్‌ భద్రతాధికారి ఒకరు పేర్కొన్నారు.
  • ఇరాన్‌ తన సొంత ప్రణాళికలు, నిర్దిష్ట లక్ష్యాల ప్రకారమే యుద్ధాన్ని కొనసాగిస్తోందని సదరు భద్రతాధికారి తెలిపారు
2026-04-05 12:16:09

రెండో పైలట్‌ను గుర్తించిన అమెరికా..

  • రెండో పైలట్‌ను గుర్తించిన అమెరికా..
  • అమెరికా యుద్ధ విమానం F-15E స్ట్రైక్‌ ఈగల్‌ కూలిపోయిన ఘటనలో రెండో పైలట్‌ను గుర్తింపు
  • అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడి.
  • అతడు సురక్షితంగా, అమెరికా బలగాల ఆధీనంలోనే ఉన్నట్లు పేర్కొన్నాయి.
  • ఈ నెల 3న అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాన్‌ కూల్చిన సంగతి తెలిసిందే.
  • ఈ ఘటనలో ఒక పైలట్‌ను కాపాడగా, రెండో పైలట్‌ కనిపించకపోవడంతో అమెరికా, ఇరాన్‌ అతడి కోసం జల్లెడ పట్టాయి.
  • ప్రస్తుతం ఇద్దరు పైలట్లను ఇరాన్‌ భూభాగం నుంచి తీసుకురావాల్సి ఉన్నట్లు సమాచారం.
     
2026-04-05 10:10:06

కువైట్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌..

  • కువైట్‌పై ఇరాన్‌ భీకర దాడులతో విరుచుకుపడింది.
  • షువైఖ్‌ ఆయిల్‌ సెక్టార్‌ కాంప్లెక్స్‌లో డ్రోన్‌ దాడి జరిగింది.
  • దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
  • కువైట్‌ నగరంలోని ఓ ప్రభుత్వ భవనంపై కూడా డ్రోన్‌ దాడి.
  • ఈ కాంప్లెక్స్‌లో చమురు మంత్రిత్వశాఖ, కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం
  • దాడి కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని అధికారుల వెల్లడి.
  • ఎవరికీ గాయాలు కాలేదని ప్రకటన.
  • మంటలను అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 
2026-04-05 09:06:34

యుద్ధం వేళ.. ప్రధాని మెలోని సంచలన నిర్ణయం

  • ఇటలీ ప్రధాని మెలోని సంచలన నిర్ణయం
  • ఇంధన ఆందోళనల నడుమ సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలలో పర్యటించిన ఇటలీ ప్రధాని మెలోని
  • ఈ మేరకు ఎక్స్‌ వేదికగా మెలోనీ సందేశం..
  • నేను సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉండాలనుకున్నాను.
  • ఇంతటి క్లిష్ట దశలో, మన భద్రతతో పాటు మన ఆర్థిక భవిష్యత్తుకు మూల స్తంభాలైన ప్రదేశాలలో ఇటలీ ఉండటం చాలా ముఖ్యం.
  • ఇది నేను నమ్ముతున్నాను.
  • ఈ సంఘర్షణ కొత్త దశ ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్‌లో ఒక యూరోపియన్ నాయకుడు చేపట్టిన మొదటి పర్యటన ఇది.
  • అయితే, ఇది కేవలం ఒక ప్రతీకాత్మక పర్యటన కాదని స్పష్టంగా తెలుస్తోంది అంటూ వ్యాఖ్యలు.. 
2026-04-05 08:50:35

ఇరాన్‌ టాప్‌ లీడర్లు హతం: ట్రంప్‌

  • ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు అమెరికా దాడిలో హతం.
  • దాడుల వీడియోను షేర్ చేసిన ట్రంప్‌.
  • వీడియోలో చీకటి వాతావరణంలో విమానాల శబ్దాలు, భారీ పేలుళ్ల ధ్వనులు వినిపిస్తున్నాయి.
2026-04-05 08:50:35

అమెరికా స్థావరాలపై దాడులు

  • ఇరాన్ సైన్యం యూఏఈ, కువైట్‌లలో ఉన్న అమెరికా స్థావరాలపై డ్రోన్ దాడులు
  • అరాష్-2 డ్రోన్లను ఉపయోగించి రాడార్ వ్యవస్థలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
  • యూఏఈలోని అల్యూమినియం పరిశ్రమలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది.
  • ఈ పరిశ్రమలు సైనిక సామగ్రి తయారీలో కీలకమని ఇరాన్ ఆరోపిస్తోంది. 
2026-04-05 08:50:35

140కు పైగా లక్ష్యాలు ధ్వంసం

  • ఇజ్రాయెల్ కూడా తన దాడులను మరింత విస్తరించింది.
  • ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇరాన్‌లో 200కు పైగా మౌలిక సదుపాయాలపై దాడులు జరిపినట్లు ప్రకటించాయి.
  • లెబనాన్‌లో హెజ్బొల్లాకు చెందిన 140కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపాయి.
  • ఈ దాడుల్లో ఇరాన్ విప్లవ గార్డుల ఆయుధ నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి తయారీ కేంద్రాలు లక్ష్యాలుగా మారాయి.
  • విమానాలపై దాడులకు ఉపయోగించే బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
2026-04-05 08:50:35

కూలిన అమెరికా యుద్ధ విమానంపై ట్విస్ట్‌..

  • కూలిన అమెరికా యుద్ధ విమానంపై ట్విస్ట్‌..
  • ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానం ఘటన మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
  • ఆ విమానం సిబ్బందిలో ఒకరిని వెతికేందుకు శోధన చర్యలు చేపట్టిన అమెరికా.
  • ఈ సమయంలో స్థానిక తెగలు హెలికాప్టర్లపై కాల్పులు జరిపినట్లు సమాచారం.
  • కోహ్గిలుయెహ్, బోయర్-అహ్మద్ ప్రాంతాలతో పాటు బఖ్తియారి ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
2026-04-05 08:50:35

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు..

  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు..
  • ఇరాన్‌లోని కోహ్గిలుయెహ్ ప్రాంతంలోని బ్లాక్ మౌంటెన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడి
  • ఈ దాడిలో కనీసం ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
  • ఘటన స్థలంలో అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
  • ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పుడు ఆరు వారాలు దాటాయి.
  • అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ వరుసగా దాడులు చేస్తోంది.
  • ఇరు పక్షాల చర్యలతో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
2026-04-05 08:50:35
Advertisement
 
Advertisement
Advertisement