అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్స్ కూల్చివేత.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు | US-Israel-Iran War Live Updates On Apr 4th | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్స్ కూల్చివేత.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించలేదు: ఇరాన్‌

  • మేమెప్పుడూ పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించలేదు: ఇరాన్‌
  • పాకిస్తాన్‌లో అమెరికాతో చర్చలకు మేము సిద్ధం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్సాస్‌ అర్గాచీ
  • మేము పాకిస్తాన్‌తో మధ్యవర్తిత్వాన్ని కాదన్నట్లు వస్తున్న వార్తలు అంతా యూఎస్‌ మీడియా సృష్టి
  • చర్చలకు మాకు పాకిస్తాన్‌ అడ్డేమీ కాదు
2026-04-04 18:50:21

యుద్ధ విమానాలు కూలినా చర్చలు ఆగవు: ట్రంప్‌

  • అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్స్ కూల్చివేతపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • యుద్ధ విమానాలు కూలినా చర్చలు ఆగవన్న ట్రంప్‌

  • యుద్ధం మధ్యే చర్చలు.. ఇరాన్‌ పాల్గొనడంపై అనిశ్చితి

  • గల్లంతైన పైలట్‌ కోసం అమెరికా సైన్యం గాలింపు

  • అమెరికా పైలట్‌ను పట్టిస్తే రివార్డ్ ఇస్తామంటూ ఇరాన్‌ మీడియా ఆఫర్‌

     

2026-04-04 17:58:58

బుషెహర్ అణు స్థావరంపై క్షిపణి దాడి!

  • ఇరాన్‌లోని బుషెహర్ అణు స్థావరంపై క్షిపణి దాడి!
  • వివరాలు తెలిపిన ఇరానియన్ వార్త సంస్థ తస్నీమ్
  • అణు స్థావరం సమీపంలో ఒకరి మృతి
  • శనివారం (ఏప్రిల్‌ 4న) ఉదయం ఘటన
  • అణు విద్యుత్‌ కేంద్రం ప్రధాన భాగాలు దెబ్బతినలేదు
2026-04-04 15:55:50

మాండెబ్‌ జలసంధిపై ఇరాన్‌ నిర్ణయం?

  • బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిని ఇరాన్‌ మూసేస్తుందా..?
  • ఆ అర్థం వచ్చేలా ఇరాన్ స్పీకర్ పోస్టు
  • ఇప్పటికే హార్మూజ్ అంతరాయాలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచం
  • బాబ్‌ అల్‌ మాండెబ్‌.. హిందూ మహాసముద్రం, ఎర్రసముద్రాన్ని కలిపే వ్యూహాత్మక జలమార్గం
2026-04-04 10:37:29

ఇరాన్ అధ్యక్షుడి ప్రశ్నలు..

  • ఇరాన్ అధ్యక్షుడి ప్రశ్నలు..
  • ఇరాన్, ఇజ్రాయెల్​- అమెరికా మధ్య 36వ రోజుకు చేరినా యుద్ధం.
  • రెండు వర్గాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి.
  • ఇరాన్‌కు చెందిన ఓ అధికారి కుటుంబంపై ప్రాణాంతక దాడి
  • అమెరికా దౌత్య ప్రయత్నాల చిత్తశుద్ధిపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఆగ్రహం.
  • దాడిలో ఒక ఉన్నత స్థాయి వ్యక్తి భార్య హత్యకు గురయ్యారని మసూద్‌ ప్రకటన.నౌ
  • హింస జరిగిన సమయాన్ని తన అంతర్జాతీయ సంబంధాలతో ముడిపెడుతూ, 
  • శాంతి పిలుపులకు, క్రియాశీలక శత్రుత్వాలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని పెజెష్కియన్ నొక్కిచెప్పారు.
  • నేను అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగానే ఈ లక్షిత దాడి జరిగిందని మసూద్‌ వెల్లడి.
  • ఇది నిర్మాణాత్మక సంప్రదింపుల సాధ్యతపై సందేహాలను రేకెత్తించిందని వ్యాఖ్యలు.
  • ప్రపంచమే తీర్పు చెప్పనివ్వండి.. ఏ పక్షం సంభాషణలు, సంప్రదింపులలో పాల్గొంటుంది, ఏది ఉగ్రవాదానికి పాల్పడుతుంది? అని ప్రశ్నించారు.
2026-04-04 10:32:50

ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌పై ఇరాన్‌ దాడులు..

  • ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌పై ఇరాన్‌ దాడులు..
  • ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌ టార్గెట్‌గా కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు.
  • బహ్రెయిన్‌లో మోగిన సైరన్లు..
  • సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలనని అధికారులు సూచన
  • ఇజ్రాయెల్‌లోని టెలీ అవీవ్‌పై ఇరాన్‌ దాడులు.
  • ఇరాన్‌ దాడుల్లో పౌరులు గాయపడినట్టు మీడియా ప్రకటన.
2026-04-04 09:07:22

ఇరాన్‌పై దాడులు.. WHO హెచ్చరిక

  • టెహ్రాన్‌లోని ఆరోగ్య కేంద్రాలపై పలు దాడులు జరుగుతున్నాయని WHO హెచ్చరించింది
  • టెహ్రాన్‌లోని పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌పై జరిగిన వైమానిక దాడి నేపథ్యంలో స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.
  • ఇరాన్‌లో "ఆరోగ్య రంగంపై పలు దాడులు" జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిక.
  • ఆ ఇన్‌స్టిట్యూట్ తీవ్రంగా దెబ్బతిందని, ఇకపై ఆరోగ్య సేవలను అందించే స్థితిలో లేదని వ్యాఖ్యలు.
  • కనీసం 20 ఆరోగ్య కేంద్రాలు లక్ష్యంగా దాడి జరిగినట్లు WHO ధృవీకరణ. 
  • దాడులను తీవ్రంగా ఖండిచిన WHO
2026-04-04 07:37:59

యూనివర్సిటీపై దాడులు..

  • యూనివర్సిటీపై దాడులు..
  • టెహ్రాన్‌లోని షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయం భవనాలపై ఇజ్రాయెల్‌ దాడి
  • దాడుల్లో దెబ్బతిన్న భవనాలు.
2026-04-04 07:37:59

భారత్‌కు భరోసా ఇచ్చిన రష్యా

  • భారత్‌కు భరోసా ఇచ్చిన రష్యా
  • పశ్చిమాసియా యుద్ధం వేళ భారత్‌కు భరోసా ఇచ్చిన రష్యా
  • భారత్‌కు ముడిచమురు, గ్యాస్‌ సరఫరా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
  • అంతర్జాతీయ చమురు మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న వేళ రష్యా నిర్ణయం
  • ఇతర రంగాల్లో సహకారం బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాల నిర్ణయం
  •  
2026-04-04 07:37:59

త్వరలోనే హార్మూజ్‌ను తెరుస్తాం: ట్రంప్‌

  • త్వరలోనే హార్మూజ్‌ను తెరుస్తాం: ట్రంప్‌
  • అతి త్వరలోనే హార్మూజ్‌ జలసంధిని తెరుస్తామంటూ ట్రంప్‌ పోస్టు
  • చాలా సులభంగా హార్మూజ్‌ జలసంధిని తెరుస్తామని ట్రూత్‌లో ట్రంప్‌ పోస్టు
  • హర్మూజ్‌ను తెరిచి.. ప్రపంచానికి చమురును వెల్లువలా పారిస్తామన్న ట్రంప్‌ 
2026-04-04 07:37:59

ఐదుగురు భారతీయులకు గాయాలు

  • ఐదుగురు భారతీయులకు గాయాలు
  • అబుదాబిలో పడిన ఇరాన్ క్షిపణి శకలాలు
  • అబుదాబిలో ఇరాన్‌కు చెందిన క్షిపణి శకలాలు తగిలి 12 మందికి గాయాలు.
  • ఐదుగురు భారతీయులకు గాయాలు
  • వారితో పాటు ఆరుగురు నేపాలీ జాతీయులకు స్వల్ప గాయాలు.
  • ఇప్పటి వరకు ఎనిమిది మంది భారతీయులు మరణించగా, పలువురు గాయపడ్డారు.
2026-04-04 07:37:59
Advertisement
 
Advertisement
Advertisement