Live Updates
భారత్‌కు రష్యా గుడ్ న్యూస్
భారత్‌కు రష్యా గుడ్ న్యూస్
- భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రష్యా
- ముడిచమురు, గ్యాస్ సరఫరా అంశానికి సంబంధించి భారత్‌కు రష్యా భరోసా
- ముడిచమురు, గ్యాస్ సరఫరా పెంచేందుకు సిద్ధమని రష్యా ప్రకటన
త్వరలోనే హార్మూజ్‌ను తెరుస్తాం : ట్రంప్
- అతి త్వరలోనే హార్మూజ్‌ను తెరుస్తాం : ట్రంప్
- చాలా సులభంగా హార్మూజ్ జలసంధిని తెరుస్తాం
- ట్రూత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
యుద్ధ విమానం నుంచి దూకేసిన అమెరికా పైలట్
- ఇరాన్‌పై దాడి చేసే సమయంలో విమానం దూకేసిన అమెరికా పైలట్
- ఆ అమెరికా సైనికుడిని పట్టుకోవాలని ఇరాన్ పిలుపు
- తమ దేశంలో అమెరికా సైనికుడి విమానం నుంచి దూకేయడంపై ఇరాన్‌లో తీవ్ర చర్చ
- తమ భూభాగంలో దూకినట్లు ఇరాన్ టీవీ ధృవీకరణ.. ఇప్పుడు అది హాట్ టాపిక్‌గా మారిన వైనం
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..
- ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) దాడులు.
- ఇరాన్‌లోని కర్మన్షాహ్ ప్రాంతంలో దాడులు.
- ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ యూనిట్ కమాండర్ "అతిమీ"ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసి హతమార్చాయి.
- కర్మన్షాహ్‌లో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ యూనిట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న అతిమీ.
- ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ మిసైల్ దాడులకు పాల్పడిన అతిమీ.
- ఇజ్రాయెల్ దాడితో బెటాలియన్ కమాండర్లు కూడా హతం
కువైట్‌పై ఇరాన్ దాడులు..
- కువైట్‌పై ఇరాన్ దాడులు..
- కువైట్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం మిన అల్ అహ్మదిపై డ్రోన్ల దాడి
- పలు చోట్ల చెలరేగిన మంటలు
- దాడులను ప్రకటించిన కువైట్ ప్రభుత్వం
రెండో ఎఫ్-35ను కూల్చేశాం: ఇరాన్
- రెండో ఎఫ్-35ను కూల్చేశాం: ఇరాన్
- అమెరికాకు చెందిన రెండో ఎఫ్-35ను కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటన
- ఇరాన్‌కు చెందిన మెహ్ర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడి
- దీనిపై ఇప్పటి వరకు స్పందించని అమెరికా సెంట్రల్ కమాండ్
అమెరికా రాడార్ ధ్వంసం
- అమెరికా రాడార్ ధ్వంసం
- సౌదీలో అత్యంత ఖరీదైన అమెరికా రాడార్ ధ్వంసం
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో కీలకమైన AN/TPY-2 రాడారు మార్చి 1వ తేదీన ధ్వంసం
- ఉపగ్రహ చిత్రాలతో ధ్రువీకరణ
- థాడ్ వ్యవస్థకు అనుసంధానంగా వ్యవహరించే రాడారు ఇదే
ఇరాన్ వంతెనలే మా లక్ష్యం
- ఇరాన్ వంతెనలే మా లక్ష్యం
- ట్రంప్ తాజా ట్రూత్ పోస్టులో హెచ్చరికలు
- ఇంకా ఇరాన్‌లో మిగిలి ఉన్న వాటిని ధ్వంసం చేయడం మొదలుపెట్టలేదన్న ట్రంప్
- తర్వాత వంతెనలు.. ఆపై విద్యుత్తు ప్లాంట్లు అని వెల్లడి
- కొత్త నాయకత్వానికి ఏమి చేయాలో తెలుసు.. దానిని త్వరగా ఆచరించాలని హెచ్చరిక
ఇరాన్ అధ్యక్షుడికి ఫిన్లాండ్ అధ్యక్షుడు ఫోన్..
- ఇరాన్ అధ్యక్షుడికి ఫిన్లాండ్ అధ్యక్షుడు ఫోన్..
- 35వ రోజుకు చేరిన యుద్ధం..
- టెహ్రాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు.
- ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్
- కాల్పుల విరమణ, దౌత్యపరమైన పరిష్కారంపై చర్చ.
- దాడులను వెంటనే నిలిపివేయాలని, అలాగే హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకల స్వేచ్ఛను పునరుద్ధరించాలని వ్యాఖ్యలు.
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ తమ దాడులను తీవ్రతరం చేశాయి.
- ఇరాన్‌కు చెందిన అతిపెద్ద వంతెన లక్ష్యంగా భీకర దాడులు జరిగాయి.
- దాడులతో వంతెన పాక్షికంగా దెబ్బతింది.
- రానున్న వారాల్లో ఇరాన్‌పై అతి భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిక.
ఇరాన్ వంతెనపై దాడి.. ఇద్దరు మృతి
- ఇరాన్ వంతెనపై దాడి.. ఇద్దరు మృతి
- అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులతో వంతెనపై విరుచుకుపడ్డాయి.
- వంతెనపై పెద్దఎత్తున మంటలు చెలరేగగా.. దట్టమైన పొగ వ్యాపించింది.
- ఈ దాడిని ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది.
- దీన్ని రెండుసార్లు లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది.
- తొలిసారి జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని వెల్లడి.
- రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లగా.. అప్పుడు మరోసారి దాడి జరిగిందని తెలిపింది.
- ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు వెల్లడించింది.
- పశ్చిమాసియాలోనే అతిపెద్దదైన ఈ వంతెన ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.
- ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను పశ్చిమాన ఉన్న కారజ్ నగరంతో దీన్ని అనుసంధానిస్తున్నారు.
- ఇక, ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
JUST IN:
US and Israel have targeted Iran's B1 Bridge in Karaj again, the tallest bridge in the Middle East.
The renewed strike occurred while rescue and relief teams were assisting victims from the initial attack... See more pic.twitter.com/EojvvsPp9V— Ayatollah Alireza Arafi (@Realarafi) April 2, 2026


