పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్‌ చర్చ | US-Israel-Iran War Live Updates on 24th March | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్‌ చర్చ

ఇరాన్ యుద్ధం వల్ల ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం

  • ‘జాతీయ శక్తి అత్యవసర పరిస్థితి’ని విధించిన ఫిలిప్పీన్స్ 
  • ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ప్రకటన 
  • ఇంధన సరఫరాలు, ఎనర్జీ స‍్టెబిలిటీపై ప్రభావం పడిందని వివరణ
2026-03-24 20:23:39

మోదీకి ట్రంప్‌ ఫోన్‌

  • ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌
  • పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించిన మోదీ, ట్రంప్‌
2026-03-24 18:26:00

ఇరాన్‌ కొత్త సెక్యూరిటీ చీఫ్‌ నియామకం

  • మొహమ్మద్ బాఘర్ జోల్ఘద్ర్ ను సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త కార్యదర్శిగా నియమించిన ఇరాన్‌
  • దేశ భద్రతా విధానాలను నిర్ణయించే అత్యున్నత సంస్థే ఈ ‘కౌన్సిల్’ 
  • అలీ లారిజానీ మృతితో కొత్త చీఫ్‌ను నియమించిన ఇరాన్‌
2026-03-24 17:41:11

ఇరాన్‌ దాడులను అడ్డుకున్నాం: యూఏఈ

  • ఇరాన్ నుంచి వచ్చిన 5 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నాం
  • 17 డ్రోన్లను కూడా మా గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది: యూఏఈ
2026-03-24 16:34:12

యుద్ధ సంక్షోభంలో అక్కడి భారతీయులు: మోదీ

  • రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ 
  • మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి
  • భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది
  • విదేశాల్లో ఉన్న భారతీయులందరి రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం
  • గల్ఫ్‌ దేశాల్లోని భారతీయులు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారు
  • 700 మంది వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చాం: మోదీ
2026-03-24 14:35:17

జలసంధిలో ఉద్రిక్తత.. వీడియో వైరల్‌

  • జలసంధిలో ఉద్రిక్తత.. వీడియో వైరల్‌ 
  • హార్మూజ్‌జలసంధిలో పీక్‌ స్టేజ్‌కు ఉద్రిక్తతలు
  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
  • అమెరికన్ నౌకను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
  • ఈ సందర్భంలో అమెరికా ప్రయత్నం విఫలమైంది!
  • అనంతరం, ఇరాన్ నుండి స్పష్టమైన సందేశం వెలువడింది.  
  • హార్మూజ్‌ జలసంధి అమెరికాకు సంబంధించినది కాదు ఇరాన్‌ ప్రకటన.
2026-03-24 13:56:14

ఇరాన్‌ కీలక ప్రకటన.. ఆ దేశాలకు గుడ్‌న్యూస్‌

  • ఇరాన్‌ కీలక ప్రకటన.. ఆ దేశాలకు గుడ్‌న్యూస్‌
  • ఇరాన్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కీలక ప్రకటన..
  • తటస్థ దేశాల నౌకలు హార్మూజ్‌ మీదుగా వెళ్లవచ్చని ఇరాన్‌ ప్రకటన.
  • అయితే, ముందస్తు అనుమతులు తప్పనిసరి అని వెల్లడి. 
     
2026-03-24 13:47:18

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు..

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు..
  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణుల ప్రయోగం.
  • ఈశాన్య అజార్‌బైజాన్‌పై ఇజ్రాయెల్‌ దాడిలో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు.
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం. 
2026-03-24 13:39:29

ఇరాన్‌ దాడులు ఉద్దేశపూర్వకమే..

  • ఇరాన్‌ దాడులు ఉద్దేశపూర్వకమే..
  • ఇరాన్‌ ఉద్దేశపూర్వకంగానే పౌర వాణిజ్య నౌకలపై దాడులు
  • ఈ మేరకు హ్యూమన్‌రైట్స్‌ వాచ్‌ నివేదిక
  • ఈ నెల మొదట్లో కనీసం రెండు పౌర వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొన్నట్లు వెల్లడించింది. 
2026-03-24 13:36:08

టెలీ అవీవ్‌పై విరుచుకుపడిన ఇరాన్‌

  • టెలీ అవీవ్‌పై విరుచుకుపడిన ఇరాన్‌
  • ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు.
  • టెలీ అవీవ్‌పై ఇరాన్‌ భారీ దాడులు.
  • ఘటనా స్థలానికి ఇజ్రాయెల్‌ ఎమర్జెన్సీ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు. 
2026-03-24 13:32:46

ట్రంప్‌, నెతన్యాహుకు యూకే బిగ్‌ షాక్‌..

  • ట్రంప్‌, నెతన్యాహుకు యూకే బిగ్‌ షాక్‌..
  • ఇరాన్‌ యుద్ధంపై యూకే ప్రధాని స్టార్మర్ కీలక ప్రకటన.
  • ట్రంప్ మరియు నెతన్యాహులకు ఇకపై తలవంచడానికి నిరాకరించారు.
  • ఇది మా యుద్ధం కాదు; ఇరాన్‌పై దాడులు చేసేలా మమ్మల్ని నెట్టడానికి ఎలాంటి ఒత్తిడికీ సాధ్యం కాదు.
  • మేము కేవలం రక్షణాత్మక స్థితిలో ఉన్నాము అని స్టార్మర్‌ ప్రకటన.
  • ట్రంప్ కాల్పుల విరమణ కోసం ఎందుకు వేడుకుంటున్నారు అనే విషయంలో ఆశ్చర్యం ఏమీ లేదు అని వ్యాఖ్యలు. 

 

2026-03-24 11:49:47

ఇరాన్‌లో 1500మంది మృతి

  • ఇరాన్‌లో 1500మంది మృతి
  • యుద్ధం కారణంగా ఇప్పటివరకు ఇరాన్‌లో 1,500 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
  • ఇజ్రాయెల్‌లో 15 మంది పౌరులు మృతి.
  • అలాగే 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
     
2026-03-24 11:34:40

అమెజాన్‌ ఆఫీసుపై దాడి?

  • అమెజాన్‌ ఆఫీసుపై దాడి?
  • బహ్రెయిన్‌లోని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌లో అంతరాయం
  • ఆ ప్రాంతంలో డ్రోన్ల సంచారంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వెల్లడించిన అమెజాన్‌ ప్రతినిధి
2026-03-24 11:34:40

చర్చల వెనుక ఏం జరిగింది?

  • చర్చల వెనుక ఏం జరిగింది?
  • ఇరాన్‌, అమెరికా చర్చల వెనుక ఏం జరిగింది?
  • ఎవరు మధ్యవర్తిత్వం వహించారన్న దానిపై రకరకాల ప్రచారాలు.
  • ఈజిప్ట్‌, టర్కీ, ఒమన్‌ మధ్యవర్తిత్వం వహించాయంటూ కథనాలు.
  • చర్చల్లో భారత్‌ది కీలక పాత్ర అంటూ బ్లూమ్‌బర్గ్‌ కథనం.
  • స్విట్జర్లాండ్‌ వేదికగా ఇరుదేశాలు చర్చలు జరిపినట్టు మరో ప్రచారం.
  • చర్చల్లో తమదే కీలక పాత్ర అంటూ పాక్‌ హైలైట్‌ చేసుకుంటుందన్న బ్రిటన్‌ మీడియా.
2026-03-24 10:59:03

అమెరికా-ఇరాన్‌ చర్చల ఎపిసోడ్‌లో సంచలన విషయాలు..

  • అమెరికా-ఇరాన్‌ చర్చల ఎపిసోడ్‌లో సంచలన విషయాలు..
  • ముందుగా చర్చల ప్రతిపాదన తీసుకువచ్చిన ట్రంప్‌
  • ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత, ఇరాన్‌ ఎదురుదాడితో వెనక్కి తగ్గిన ట్రంప్‌.
  • మధ్యవర్తుల ద్వారా చర్చల ప్రతిపాదన చేసిన ట్రంప్‌.
  • పైకి మాత్రం ఇరాన్‌ తమను చర్చల కోసం వేడుకుందని చెబుతున్న ట్రంప్‌.
  • చర్చలు లేవని చెబుతున్నా అమెరికా ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ఇరాన్‌.
  • అమెరికా-ఇరాన్‌ మధ్య సయోధ్య కోసం ప్రయత్నిస్తున్న టర్కీ, ఈజిప్ట్‌, పాకిస్తాన్‌.
2026-03-24 10:59:03

కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు.

  • ఇ‍జ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు.
  • ​కువైట్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ దాడి.
  • బహ్రెయిన్‌లోనూ కొనసాగుతున్న వార్‌ సైరన్లు.
  • టెల్‌ అవీవ్‌పై క్లస్టర్‌ బాంబులతో ఇరాన్‌ భీకర దాడులు.  
2026-03-24 10:59:03

అమెరికా మాస్టర్‌ ప్లాన్‌.. తెరపైకి ఇరాన్‌ స్పీకర్‌

  • తెరపైకి ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘేర్‌ ఘలిబాఫ్‌ పేరు
  • అమెరికా ఆయనతోనే చర్చలు జరిపినట్లు మీడియా కథనాలు
  • ప్రస్తుతం ఇరాన్‌లో శక్తిమంతమైన నేతల్లో ఆయనకూడా ఒకరు
  • అమెరికా ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు మీడియా కథనాలు
2026-03-24 10:43:56

కొనసాగుతున్న దాడులు

  • ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న దాడులు
  • ఇజ్రాయెల్‌పై 78వ విడత క్షిపణలు, డ్రోన్ల దండును ప్రయోగించినట్లు ప్రకటించిన ఐఆర్‌జీసీ
  • డిమోనా, టెల్‌ అవివ్‌, ఇలాట్‌, అమెరికా బేస్‌ల లక్ష్యంగా వీటి ప్రయోగం
  • మరోవైపు ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల గ్రూపు నాయకుడు సాద్‌ దావిని అంతం చేసిన అమెరికా
  • టెహ్రాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ దాడులు
2026-03-24 10:43:56

ఆరు ఎల్పీజీ ట్యాంకర్లు సిద్ధం..

  • పర్షియన్‌ గల్ఫ్‌లో సిద్ధంగా ఆరు ఎల్పీజీ ట్యాంకర్లు
  • వాటిని హర్మూజ్‌ దాటించేందుకు భారత్‌ యత్నాలు తీవ్రం
  • ఇవి భారత్‌ చేరితే దాదాపు 3,00,000 టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి
  • భారత్‌ నౌకలకు దీర్ఘకాలిక గ్యారెంటీ లేకపోవడంతో..
  • ఎప్పటికప్పుడు ఇరాన్‌తో చర్చలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి
2026-03-24 10:43:56

పాక్‌కు అమెరికా ఝలక్‌.. అదంతా ఫేక్‌

  • పాక్‌లో భేటీకానున్నట్లు వార్తలు ఊహాజనితం: వైట్‌హౌస్‌
  • పాకిస్తాన్‌ వేదికగా ఇరాన్‌-అమెరికా చర్చలు జరిగినట్లు కథనాలు
  • ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌, జారెడ్‌ కుష్నెర్‌లు ఇరాన్‌ ప్రతినిధులతో ఇస్లామాబాద్‌లో భేటీ కానున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన వైట్‌హౌస్‌
  • ఈ కథనాలు ఊహాజనితమని ఖండన. 

 

 

2026-03-24 09:17:09

ఇరాన్‌, అమెరికా యుద్ధం.. పాకిస్తాన్‌ ఎంట్రీ

  • అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన నిర్ణయం..
  • మధ్యవర్తిత్వ ప్రయత్నాల మధ్య పాకిస్తాన్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌తో ట్రంప్ సంభాషణ
  • సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో దౌత్య మార్గాలపై మాట్లాడినట్టు సమాచారం.
  • శాంతి చర్చల్లో పాకిస్తాన్ ప్రమేయంపై కూడా చర్చ?
  • వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి జరుగుతున్న ఒక రహస్య ప్రయత్నానికి సంకేతం
  • అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా ఇస్లామాబాద్‌ను ప్రతిపాదించిన పాకిస్తాన్
  • ప్రతిపాదిత సమావేశం ఈ వారంలోనే జరిగే అవకాశం.
  • ఇది ఒక ముఖ్యమైన దౌత్యపరమైన ముందడుగును సూచిస్తుంది.
2026-03-24 09:03:25

పాక్‌-ఇరాన్‌ చర్చలు..

  • షరీఫ్-పెజెష్కియన్ చర్చలు
  • ఇరాన్‌ యుద్ధం వేళ పాక్‌ ప్రధాని, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌ చర్చలు
  • దౌత్య కార్యకలాపాలపై చర్చ.
  • టెహ్రాన్‌తో ఫలవంతమైన సంభాషణలు జరిగాయని షరీఫ్‌ వ్యాఖ్యలు.
  • ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామన్న తన హెచ్చరికను వాయిదా వేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తరుణంలో ఈ చర్చలు 
     
2026-03-24 09:03:25

ఇరాన్‌కు దెబ్బకొట్టే ప్లాన్‌లో యూఏఈ..

  • ఇరాన్‌కు దెబ్బకొట్టే ప్లాన్‌లో యూఏఈ..
  • ఇరాన్‌తో సంబంధం ఉన్న ఆర్థిక నెట్‌వర్క్‌లపై యూఏఈ చర్యలు
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్‌తో సంబంధం ఉన్న ఆర్థిక నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది.
  • అధికారులు  పలు సంస్థలను మూసివేస్తున్నారు.
  • ఆస్తులను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు.
  • ఈ చర్యలు టెహ్రాన్‌కు విదేశీ మారకద్రవ్యం లభ్యతను పరిమితం చేయగలవు.
  • యుద్ధ క్షేత్రానికి భిన్నంగా ఇరాన్‌పై ఒత్తిడిని పెంచే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ చర్యను పరిగణిస్తున్నారు.
2026-03-24 07:49:13

భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు

  • భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
  • హర్మూజ్ నుంచి భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
  • హర్మూజ్ జలసంధి నుంచి భారత్‌కు పయనమైన జాగ్ వసంత్, పైన్ ఎల్పీజీ నౌకలు
  • 92,612 మెట్రిక్ టన్నులు ఎల్పీజీ తీసుకొస్తున్న జాగ్‌వసంత్, పైన్ నౌకలు
  • ఈనెల 26 నుంచి 28లోపు భారత్‌లోని పోర్టులకు చేరుకోనున్న రెండు నౌకలు
2026-03-24 07:40:55

నెతన్యాహు సంచలన ప్రకటన..

  • ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన..
  • ఇరాన్‌పై దాడులు ఆపే ప్రసక్తే లేదు.
  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతాయి.
  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సాధించిన విజయాల ఆధారంగానే ట్రంప్‌ ఒప్పందం చేసుకోవాలి.
  • ఇజ్రాయెల్‌ ప్రయోజనాలే మాకు ముఖ్యం.
  • అధ్యక్షుడు ట్రంప్‌తో తాను మాట్లాడినట్టు నెతన్యాహు వెల్లడి. 
2026-03-24 07:26:53

ఇరాన్‌ దాడులపై గల్ఫ్‌ దేశాల ఆగ్రహం​..

  • ఇరాన్‌ దాడులపై గల్ఫ్‌ దేశాల ఆగ్రహం​..
  • పెరుగుతున్న ఇరాన్ దాడులు గల్ఫ్ దేశాల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి
  • గల్ఫ్ అంతటా ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది.
  • పలు దేశాల్లోని ఇంధన కేంద్రాలపై ఇరాన్‌ దాడులు జరిగినట్లు నివేదికలు
  • ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై దాడి.
  • ఇరాన్ చర్యలు ప్రాంతీయ స్థిరత్వానికి ప్రత్యక్ష ముప్పుగా పరిగణించడంలో గల్ఫ్ నాయకులు ఏకమవుతున్నారు.
2026-03-24 07:26:53

డ్రోన్‌ దాడుల కలకలం..

  • డ్రోన్‌ దాడుల కలకలం..
  • సౌదీ అరేబియాపై ఇరాన్‌ డ్రోన్‌ దాడుల యత్నం
  • 19 డ్రోన్లను కూల్చివేసినట్టు సౌదీ రక్షణ శాఖ ప్రకటన
  • కింగ్‌డమ్‌ ఆయిల్‌-రిచ్‌ ఈస్ట్రన్‌ ప్రావినెన్స్‌లో డ్రోన్లను అడ్డుకున్నట్టు వెల్లడి. 
2026-03-24 07:06:55

కువైట్‌లో పవర్‌ కష్టాలు..

  • కువైట్‌లో పవర్‌ కష్టాలు..
  • ఇరాన్‌ దాడుల కారణంగా కువైట్‌ల్‌ విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం.
  • దాడుల నేపథ్యంలో హైఓల్టేజ్‌ పవర్‌ లైన్స్‌ పూర్తి దెబ్బతిన్నట్టు ప్రకటన
  • కేబుల్స్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు కువైట్‌ అధికారులు ప్రకటించారు.
2026-03-24 07:06:55
Advertisement
 
Advertisement
Advertisement