Live Updates
దోహా, ఖతార్, యూఏఈపై.. ఇరాన్ భీకర దాడులు
7 లక్షల మంది బాధ వర్ణనాతీతం
- ఇజ్రాయెల్, హిజ్బుల్లా గ్రూప్ మధ్య తీవ్రమైన పోరాటం
- లెబనాన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన యుద్ధం
- లెబనాన్‌లో నిరాశ్రయులైన సుమారు 7 లక్షల మంది
ట్రంప్‌ను ఖతం చేస్తాం: ఇరాన్ సంచలనం
- ట్రంప్‌కు ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని వార్నింగ్
- ట్రంప్‌ను మించిన వారికీ ఇరాన్‌ను నాశనం చేయడం సాధ్యం కాలేదు: అలీ
- జాగ్రత్తగా ఉండు ట్రంప్.. లేకపోతే నిన్నే ఖతం చేస్తారు: అలీ లారిజాని
ఈ రోజు ఉహించని దాడులు..
- ఈ రోజు చాలా పెద్దఎత్తున దాడులు ఉంటాయి
- గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు ఉంటాయి
- అమెరికా రక్షణ శాఖ మంత్రి వ్యాఖ్యలు
- సంచలన ప్రకటన చేసిన పీట్ హెగ్సెత్
రష్యా అత్యున్నత దౌత్యవేత్త ఇరాన్ ప్రతినిధితో భేటీ
- రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, అబ్బాస్ అరాఘ్చితో రాజకీయ , దౌత్యపరమైన పరిష్కారం చర్చలు
- ఇరాన్ , పొరుగు దేశాల భద్రత, ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది లావ్‌రోవ్
ఇరాన్‌లోని పాఠశాలపై దాడిని 'చాలా తీవ్రంగా' పరిగణిస్తోంది
- ఇరాన్ లోపల మంగళవారం అత్యంత తీవ్రమైన దాడులు : రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్
- అమెరికా సైన్యం ఇరాన్‌లోని పాఠశాలపై దాడి చేసిందా లేదా అనేదాన్ని పెంటగాన్'చాలా తీవ్రంగా' పరిగణిస్తోందన్నారు.
యుఎఇ పారిశ్రామిక నగరం రువైస్‌పై ఇరాన్ కొత్త క్షిపణి దాడి
- మంగళవారం మధ్యాహ్నం క్షిపణి దాడి : ఇజ్రాయెల్ సైన్యం
- సౌదీ అరేబియా సరిహద్దుకు సమీపంలోని ప్రాంతం పెట్రోకెమికల్ ప్లాంట్లకు నిలయం.
- దోహా, ఖతార్, యూఏఈపై కూడా ఇరాన్ భీకర దాడులు
హర్మూజ్ జలసంధి మూసివేతపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ముడి చమురు సరఫరా నిలిపివేస్తే, భయంకర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది: ట్రంప్
- గతంకంటే 20 రెట్లు శక్తివంతమైన దాడులు చేస్తాం.
- హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని ఇరాన్‌కు హెచ్చరిక
ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ ప్రతినిధి సంచలన ప్రకటన
- "ఒక్క లీటరు చమురు" కూడా పర్షియన్ గల్ఫ్ నుండి బయటకు వెళ్లనివ్వబోం అలీ మొహమ్మద్ నాయిని
- ఇరాన్ తదుపరి నోటీసు వచ్చేవరకు శత్రు పక్షానికి , దాని భాగస్వాములకు ఒక్క లీటరు ఎగుమతికి కూడా అంగీకరించం.
సౌదీ అరేబియాపై ఇరాన్ భీకర దాడులు
- అరఖర్డ్ ప్రాంతాలో డ్రోన్లతో దాడి చేసిన ఇరాన్
- గాల్లోనే డ్రోన్లను ధ్వంసం చేశామంటున్న సౌదీ
యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన
త్వరలో యుద్ధాన్ని ముగిస్తున్నామంటూ ట్రంప్ ప్రకటన
ట్రంప్ ప్రకటనకు ధీటుగా స్పందించిన ఇరాన్
అమెరికాపై పదేళ్లయినా యుద్ధం చేస్తాం.
ఎన్నేళ్లయినా యుద్ధం చేసే సత్తా మాకుంది
పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన శ్రీలంక
పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన శ్రీలంక
శ్రీలంకలో అర్ధరాత్రి నుంచి ధరల పెంపు అమలు
ఆక్టేన్ 92 పెట్రోల్ రూ.24 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.317.. ఆక్టేన్ 95 పెట్రోల్ రూ.25 పెంపు
ప్రస్తుతం లీటర్ రూ.365.. ఆటో డీజిల్ రూ.22 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.303.. సూపర్ డీజిల్ రూ.24 పెంపు
ప్రస్తుతం లీటర్ రూ.353.. కిరోసిన్ రూ.13 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.195.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన పాకిస్థాన్
లీటరుకు రూ.55 పెంచిన పాకిస్థాన్ ప్రభుత్వం
అమెరికా అత్యాధునిక డ్రోన్లను ధ్వంసం చేసిన ఇరాన్
- ఇజ్రాయెల్-అమెరికా స్థావరాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- అమెరికా అత్యాధునిక డ్రోన్లను ధ్వంసం చేసిన ఇరాన్
ఆరు ఇరాన్ ఎయిర్‌పోర్ట్‌లపై దాడులు చేశాం: ఇజ్రాయెల్
- ఇరాన్‌లోని 6 ఎయిర్‌పోర్ట్‌లపై దాడులు: ఇజ్రాయెల్
- 1900 మందికి పైగా ఇరాన్ సైనికులు మృతి
రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్
- ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం
- చమురు సరఫరాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్
- యుద్ధం ఇలానే కొనసాగితే 30 రోజుల్లో హర్మూజ్ జలసంధి బంద్
- అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదు
యుద్ధం ముగించేది మీరు కాదు.. మేం ఇరాన్
- ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్
- ఎవరేంటో చూసుకుందాం..
- యుద్ధం ముగించేది మీరు కాదు.. మేం: ఇరాన్
- గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది మేమే
- అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్లపై దాడులు చేస్తూనే ఉంటాం
ఇజ్రాయెల్‌లో నిజామాబాద్ జిల్లా వాసికి గాయాలు
- ఇరాన్ బాంబు దాడిలో గాయపడిన నిజామాబాద్ వాసి తిరుపతి
- ఇజ్రాయెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి
ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ ముగింపు?
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
తర్వలో యుద్ధానికి ముగింపు పలుకున్నట్లు స్పష్టత
ప్రపంచ దేశాల్లో భారీగా పెరుగుతున్న ఆయిల్,గ్యాస్ ధరలు
తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అమెరికన్లు
ఇరాన్‌తో యుద్ధం వల్లే తమకు ఈ అగచాట్లు అంటూ గగ్గొలు
పరోక్షంగా ట్రంప్‌పై విమర్శలు
అందుకే ఇరాన్‌పై దాడులకు ట్రంప్ తలొగ్గారన్న విశ్లేషకులు
కాబట్టే ఇరాన్‌పై దాడులకు విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
చమురు సరఫరాలో ఇరాన్ అంతరాయం చేస్తే ఊపేక్షించబోమని హెచ్చరిక
ఇజ్రాయెల్,అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్‌కు మద్దతుగా రష్యా
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్
ఇరాన్‌పై యుద్ధంలో దౌత్య పరిష్కారం అవసరమన్న పుతిన్
మాపై పదే పదే దాడులు చేస్తున్నారు: ఇరాన్
- ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని తమ దేశ కాన్సులేట్ జనరల్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడిని ఖండించిన యూఏఈ
- మ మ్మల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం సరికాదు
- మేము ఎప్పుడూ ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయలేదు
- కానీ మాపై ఇరాన్ పదేపదే దాడులు చేస్తుంది
- అమెరికాకు మిత్రదేశంగా ఉన్నందుకే ఇరాన్ ఈ దాడులు చేస్తుంది
పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్-పుతిన్ చర్చలు
- రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్
- పశ్చిమాసియా యుద్ధంపై చర్చించిన ట్రంప్-పుతిన్
- ఉక్రెయిన్ యుద్ధం, వెనెజువెలా అంశాలు కూడా ప్రస్తావన
- ఇరాన్‌పై యుద్ధం చాలా వరకూ పూర్తయింది
- ఇరాన్‌కు నేవీ, ఎయిర్‌ఫోర్స్, కమ్యూనికేషన్లు లేవన్న ట్రంప్
- ఇరాన్ క్షిపణులను చాలా వరకూ కూల్చేశామన్న ట్రంప్
- ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజుబ్తా ఎంపికపై ట్రంప్ ఆగ్రహం
- మొజ్తాబా ఎంపిక సరైన నిర్ణయం కాదు
ఇరాన్‌లో 30 కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు
- క్షిపణి, అణు కేంద్రాలపైనా బాంబుల వర్షం
- తీవ్రస్థాయిలో ప్రతి చర్యలకు దిగిన ఇరాన్
- గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై దాడులు
- మంటల్లో యూఏఈ, బహ్రెయిన్ క్షేత్రాలు
- ఖమేనీ వారసునిగా కుమారుడు మొజ్తబా
- సుప్రీం నేతగా ఎన్నుకున్న మత పెద్దల కమిటీ
- భారతీయులెవరూ మరణించలేదు: సౌదీ
- ఇజ్రాయెల్‌లో ఓ భారతీయునికి గాయాలు
ఫ్రాన్స్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
- ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు
- రాబోయే రోజుల్లో ఈ సంఘర్షణ ముగిసే అవకాశాలు లేవు
- ఈ యుద్ధం ప్రస్తుత తీవ్ర స్థాయిలో ఇంకా చాలా రోజులు, బహుశా పలు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది.
- ఇది పూర్తిగా ప్రతి పక్షం తమ తుది లక్ష్యాలను ఎలా నిర్వచిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది
- "అంతిమంగా ఏ తుది స్థితిని సాధించాలనుకుంటున్నారో అదే ఈ యుద్ధం ఎంతకాలం ఉంటుందో నిర్ణయిస్తుంది"


