ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను స్వీకరించేందుకు సిద్ధం: రష్యా | Iran israel And US war latest Updates On 13th April | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను స్వీకరించేందుకు సిద్ధం: రష్యా

ఇరాన్‌ పోర్టులు దిగ‍్బంధం

  • ఇరాన్‌ పోర్టులను దిగ‍్బంధిస్తున్న అమెరికా
  • ఇరాన్ నౌకలకు ట్రంప్ హెచ్చరిక జారీ
  • ఏ నౌక వచ్చినా దాన్ని వెంటనే నాశనం చేస్తామని వార్నింగ్‌
2026-04-13 21:25:01

భారత ట్యాంకర్లు టోల్ చెల్లించలేదు: ఇరాన్

  • హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన భారత ట్యాంకర్లు 

  • ఇరాన్‌కు భారత్‌ టోల్ చెల్లించిందని ప్రచారం

  • ఆ ప్రచారాన్ని ఖండించిన ఇరాన్ 

  • భారత ట్యాంకర్లు టోల్ చెల్లించలేదు: న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారి

2026-04-13 19:13:32

ఆ ఆఫర్‌ను ఇప్పటికీ అలాగే ఉంచాం: రష్యా

  • ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను స్వీకరించేందుకు రష్యా సిద్ధం

  • అమెరికాతో భవిష్యత్‌లో చేసుకునే శాంతి ఒప్పందంలో ఇది ఉపయోగపడుతుంది

  • ఈ ప్రతిపాదనను పుతిన్ అమెరికా, ఇతర దేశాలతో సంప్రదింపుల్లో వెల్లడించారు

  • ఆ ఆఫర్‌ను ఇప్పటికీ అలాగే ఉంచాం.. కానీ అమలు కాలేదు

    -రష్యా అధ్యక్షుడి కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటన
     

2026-04-13 17:27:47

లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు

  • దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి

  • నబాతియె అల్-ఫౌకా పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు

  • అల్-అబ్బాసియె పట్టణం, బింట్ జ్బెయిల్ నగరంపై కూడా దాడులు 
     

2026-04-13 15:48:19

గల్ఫ్‌ ఓడరేవులపై ఇరాన్‌ హెచ్చరిక

  • గల్ఫ్‌ ఓడరేవుల యాజమాన్యంపై ఇరాన్‌ కీలక ప్రకటన..
  • అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు సరికాదు: ఇరాన్‌
  • అమెరికా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్య.
  • అమెరికా వైఖరి సముద్రపు దొంగల తరహాలో ఉంది.  
  • గల్ఫ్‌ ఓడరేవులు అందరికీ చెందుతాయి.
  • ఒకవేళ అందరికీ చెందకుంటే.. ఎవరికీ లేకుండా పోతాయి.
  • హార్మూజ్‌ జలసంధి రాకపోకల నియంత్రణకు శాశ్వత యంత్రాంగం. 
     
2026-04-13 13:42:51

హార్మూజ్‌లో చిక్కుకుపోయిన భారత నౌకలు

  • హార్మూజ్‌లో చిక్కుకుపోయిన భారత నౌకలు
  • అమెరికా నౌకాదళ దిగ్బంధంతో చిక్కుకుపోయిన 15 భారత నౌకలు
  • వీటిల్లో చాలా వరకు ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ క్యారియర్లే
  • మొత్తం 25 నౌకలు ఉండగా.. 10 హర్మూజ్‌ను దాటినట్లు వెల్లడిస్తున్న ట్రాకింగ్‌ డేటా
2026-04-13 13:31:05

నాటోపై ట్రంప్‌ చిందులు..

  • నాటోపై ట్రంప్‌ చిందులు..
  • నాటోపై ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు.
  • ఇరాన్‌తో యుద్ధంలో నాటో కలిసి రాకపోవడంపై ట్రంప్‌ నిరాశ.
  • రష్యా నుంచి యూరప్‌ను కాపాడటానికి అమెరికా నాటోకు ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేసిందని వ్యాఖ్యలు.
  • ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేసినా నాటో ఇప్పుడు మా పక్కన లేదు: ట్రంప్
2026-04-13 13:27:27

ట్రంప్‌ వివాదాస్పద పోస్టు..

  • ట్రంప్‌ వివాదాస్పద పోస్టు..
  • ఏఐతో రూపొందించిన వివాదాస్పద చిత్రాన్ని పోస్ట్ చేసిన ట్రంప్
  • ట్రంప్, కాథలిక్ చర్చి అధిపతి పోప్ లియో XIV మధ్య ఉన్న విభేదాలు తీవ్రరూపం
  • పోప్‌పై ఇప్పటికే విమర్శలు చేసిన ట్రంప్
  • ఇప్పుడు ఏఐతో రూపొందించిన ఓ వివాదాస్పద చిత్రం సోషల్ మీడియాలో పోస్టు
  • అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై చేయి ఉంచి అద్భుతం చేస్తున్నట్లుగా చూపించిన ట్రంప్‌.
  • అదే సమయంలో, ఆ ఫొటో చుట్టూ అమెరికా జెండా, యుద్ధ విమానాలు, దేవదూతల రూపాలు వంటి చిహ్నాలు
  • ఈ పోస్టు ట్రంప్ చేసిన రాజకీయ వ్యాఖ్యలతో పాటు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
  • ఫొటోపై ఇరాన్‌ సైతం ఆగ్రహం. 
2026-04-13 13:27:27

ట్రంప్‌నకు షాకిచ్చిన మరో దేశం

  • ట్రంప్‌నకు షాకిచ్చిన మరో దేశం
  • హార్మూజ్‌ ముట్టడి విషయంలో ట్రంప్‌కు ఆస్ట్రేలియా ఝలక్‌
  • హార్మూజ్‌ ముట్టడిలో పాల్గొనబోమని ఆస్ట్రేలియా ప్రకటన. 
     
2026-04-13 10:31:40

ట్రంప్‌కు ఝలక్‌..

  • ట్రంప్‌కు ఝలక్‌..
  • నౌకాదళ దిగ్బంధంలో విషయంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
  • దిగ్బంధంలో తాము పాల్గొనబోమని చెప్పిన పలు దేశాలు
  • తేల్చి చెప్పిన యూకే మంత్రి వెస్‌ స్ట్రీటింగ్‌
  • స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడుకొనేందుకు ఫ్రాన్స్‌తో కలిసి పనిచేస్తామన్న యూకే
2026-04-13 09:06:16

ట్రంప్‌ వ్యాఖ్యలపై ఐఆర్‌జీసీ స్ట్రాంగ్‌ కౌంటర్‌..

  • ట్రంప్‌ వ్యాఖ్యలపై ఐఆర్‌జీసీ స్ట్రాంగ్‌ కౌంటర్‌..
  • హార్మూజ్‌ జలసంధి మా కంట్రోల్‌లోనే ఉంది: ఇరాన్‌
  • హార్మూజ్‌ వైపు వచ్చే యుద్ధ నౌకలపై దాడులు చేస్తాం.
  • శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకుంటారు. 
2026-04-13 07:42:16

ట్రంప్‌నకు ఇరాన్‌ కౌంటర్‌..

  • ట్రంప్‌నకు ఇరాన్‌ కౌంటర్‌..
  • ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ ఘాలిబాఫ్‌
  • అమెరికా మాపై దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తాం.
  • మా సంకల్పాన్ని పరీక్షిస్తే.. గుణపాఠం నేర్పుతాం.
2026-04-13 07:37:50

నౌకలను నిలిపివేస్తాం: ట్రంప్‌

  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.
  • ఇరాన్‌ పోర్టులను బ్లాక్‌ చేస్తామని ట్రంప్‌ ప్రకటన.
  • ఇరాన్‌కు టోల్‌ చెల్లించే నౌకలను అడ్డుకోవాలని ట్రంప్‌ ఆదేశం.
  • ఇరాన్‌ ఆర్థిక వనరులను దెబ్బతీసేందుకు ట్రంప్‌ నిర్ణయం.
  • మిగిలిన దేశాల రాకపోకలను ఆటంకం కలిగించబోమని అమెరికా వివరణ.
  • అంతర్జాతీయ జలాల్లో నౌకలను నిలిపివేస్తాం: ట్రంప్‌
  • ఇచ్చిన మాటను ఇరాన్‌ నిలబెట్టుకోలేదన్న ట్రంప్‌
  • హార్మూజ్‌లో ఇరాన్‌ మైన్స్‌ను ధ్వంసం చేస్తామని ట్రంప్‌ హెచ్చరిక.
  • ఇరాన్‌ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ నిర్వీర్యం అయ్యాయి.
  • సరైన సమయంలో ఇరాన్‌ను అంతం చేస్తాం.
2026-04-13 07:37:50

యుద్ధం కొనసాగుతోంది: నెతన్యాహు

  • దక్షిణ లెబనాన్ పర్యటన సందర్భంగా బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు.
  • యుద్ధం ఇంకా ముగియలేదు, ఇజ్రాయెల్ శత్రువులు ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నారని కామెంట్స్‌.
  • భద్రతా జోన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా లెబనాన్ నుండి సరిహద్దు దాటి జరగబోయే దాడిని ఇజ్రాయెల్ విజయవంతంగా నిరోధించింది.
2026-04-13 07:37:50

ఇరాన్‌పై ట్రంప్‌ కొత్త ప్లాన్‌..

  • ఇరాన్‌పై ట్రంప్‌ కొత్త ప్లాన్‌..
  • ఇరాన్‌, అమెరికా చర్చలు విఫలం.
  • ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక చర్యలు.
  • ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా సైన్యం ప్రకటన.
  • ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే అన్ని రకాల నౌకలను కదలనీయబోమని వెల్లడి.
  • సోమవారం(ఏప్రిల్ 13) నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని వాషింగ్టన్ అధికారిక ప్రకటన.
2026-04-13 07:37:50
Advertisement
 
Advertisement
Advertisement