సదస్సుల వేదిక.. నిట్‌ | Sakshi
Sakshi News home page

సదస్సుల వేదిక.. నిట్‌

Published Sun, May 26 2024 7:20 AM

సదస్స

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌.. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులకు వేదిక అవుతోంది. నిత్యం వివిధ ఆవిష్కరణలతో ప్రపంచ స్థాయిలో తన ప్రత్యేకత చాటుకున్న నిట్‌ వరంగల్‌లో కాన్ఫరెన్స్‌ హాల్‌ కాంప్లెక్స్‌తో పాటు అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఈ క్యాంపస్‌లో సదస్సులు, సమావేశాలు నిర్వహించుకుంటే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఔత్సాహికులు, వివిధ కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఇక్కడే తమ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. సెక్యూరిటీతో పాటు పూర్తిగా ఆడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడిన ఏసీ కాన్ఫరెన్స్‌ హాల్స్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌, స్కీన్ర్స్‌తో సెంటర్లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రత్యేకంగా కాన్ఫరెన్స్‌ హాల్‌ కాంప్లెక్స్‌..

నిట్‌ వరంగల్‌లో తమ విద్యార్థులకు సదస్సులు, సమావేశాలు నిర్వహించడంతో పాటు గెస్ట్‌ లెక్చర్స్‌కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్‌ హాల్స్‌ ఏర్పాటు చే శారు. సైంటిస్ట్‌లు, స్వాతంత్య్ర ఉద్యమ సంగ్రామంలో పాల్గొన్న నాయకుల పేరిట కాన్ఫరెన్స్‌ హాల్‌ కాంప్లెక్స్‌తో పాటు రాజ్యాంగ నిర్మాత పేరిట అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

కాన్ఫరెన్స్‌ హాల్స్‌ ఇలా..

నిట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ కాంప్లెక్స్‌లో హోమీ బా బా హాల్‌, బోస్‌ హాల్‌, రామన్‌ హాల్‌, రామానుజన్‌ హాల్‌, ఖురానా హాల్‌, చంద్రశేఖర్‌ హాల్‌ ఉన్నాయి. ఇందులో హోమీబాబా హాల్‌, రామానుజన్‌ హాల్‌లో 125 మంది, ఖురానా హాల్‌ 90 మంది, బోస్‌ హాల్‌, రామన్‌ హాల్‌, చంద్రశేఖర్‌ హాల్‌లో 160 మంది, అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో 400 మంది, మరో ఆడిటోరియంలో వెయ్యి మంది కూర్చునే సామర్థ్యంతో సమావేశాలకు అనువుగా ఏర్పాటు చేశారు. అదే విధంగా నిట్‌లో ప్రతి డిపార్ట్‌మెంట్‌కు 80 నుంచి 120 మంది కూర్చునే సామర్థ్యంతో ప్రత్యేకంగా ఒక హాల్‌ ఉంటుంది.

ఆదాయ వనరుగా..

నిట్‌ వరంగల్‌లో ఏర్పాటు చేసిన సెమినార్‌ హాల్స్‌, అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియం ఆదా య వనరుగా మారుతోంది. నిట్‌ తమ సమావేశాలతో పాటు బయట వ్యక్తులకు ప్రత్యేక రుసుముతో అవకాశం కల్పిస్తోంది. కాన్ఫరెన్స్‌ హాల్‌ కాంప్లెక్స్‌లోని హాల్స్‌కు ప్రతి సమావేశానికి రూ. 8 వేలు , అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియం రూ.15వేలకు అద్దెకు ఇస్తున్నారు.

క్యాంపస్‌లో కాన్ఫరెన్స్‌ హాల్‌ కాంప్లెక్స్‌, అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఏర్పాటు

సమావేశాలకు మొగ్గుచూపుతున్న ఔత్సాహికులు

ఇన్‌స్టిట్యూట్‌కు ఆదాయం

సమకూర్చుతున్న సెంటర్లు

సదస్సుల వేదిక.. నిట్‌
1/1

సదస్సుల వేదిక.. నిట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement