ఎమ్మెల్సీ ఓటు వేయండిలా.. | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటు వేయండిలా..

Published Sun, May 26 2024 7:20 AM

ఎమ్మె

ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్‌ విధానంపై ఈసీ విడుదల చేసిననమూనా బ్రోచర్‌

వరంగల్‌ డెస్క్‌: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ రేపు (సోమవారం) జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నిక బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిన నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇతర సాధారణ ఎన్నికలకు ఓటు వేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసే క్రమంలో ఈవీఎంలను వాడుతారు. ఆ ఎన్నికల్లో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉంటుంది. ఒకే అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకు భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది.

ప్రాధాన్యతాక్రమంలోనే ఓటు..

● ప్రతీ ఓటరు బరిలో ఉన్న మొత్తం అభ్యర్థుల్లో ఒక్కరికి లేదా కొందరికి లేదా అందరికీ ఓటేయొచ్చు.

● అంకెలు మాత్రమే ఆ బాక్సులో

ప్రాధాన్యతాక్రమంలో వేయాల్సి ఉంటుంది.

● మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తేనే ఆ ఓటు

చెల్లుబాటు అవుతుంది.

● ఏ వ్యక్తికై తే మొదటి ప్రాధాన్యత ఓటు

వేస్తారో ఆ వ్యక్తి బ్యాలెట్‌ పేపర్‌ వరుసలో ఏ నంబర్‌లో ఉన్నా కూడా.. బాక్సులో 1 అనే అంకె వేయాల్సి ఉంటుంది.

● 1, 2, 3, 4, 5 ఇలా ప్రాధాన్యతాక్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయాలి.

ఒక్కరికి కూడా ఓటేయొచ్చు

● పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నా

అందులో 40వ సీరియల్‌ నంబర్‌లో ఉన్న

అభ్యర్థికి ఒక్కరికే ఓటు వేయాలంటే

అతడికి ఎదురుగా ఉన్న బాక్సులో 1 అని

ఓటు వేసి మిగతా వారికి వేయకున్నా ఆ

ఓటు చెల్లుతుంది.

● 1వ నంబర్‌ ప్రాధాన్యత ఓటు వేయకుండా 2, 3, 4 నంబర్లతో ఓట్లేస్తే ఆ ఓటు చెల్లదు.

● తప్పనిసరిగా 1 నుంచి సీరియల్‌గా మాత్రమే ఓటు వేయాలి.

● ఒక అభ్యర్థికి ఒక అంకెను మాత్రమే వేయాలి.

● అంకెలను తెలుగులో కానీ, ఇంగ్లిష్‌లో, ఇతర భాషాల్లో వన్‌, టు, త్రీ అని పదాలు, అక్షరాల్లో రాయకూడదు.

● బ్యాలెట్‌ పేపర్‌పై ఎలాంటి సంతకాలు

చేయకూడదు.

● వేలిముద్ర వేయకూడదు.

● అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్సులో రైట్‌ గుర్తు, ఇంటు గుర్తు పెట్టకూడదు.

సొంత పెన్నుతో ఓటు వేయొద్దు..

● బ్యాలెట్‌లో ఓటర్‌ ఓటు వేసేటప్పుడు సొంత పెన్నుతో ఓటు వేయొద్దు.

● అలా వేస్తే ఓటు చెల్లదు.

● ఒకరికి ఇచ్చిన ప్రాధాన్యత ఓటు మరో అభ్యర్థికి ఇచ్చినా ఆ ఓటు చెల్లదు.

● ఒకరికి 1వ నంబర్‌ వేసి దాన్ని పదేపదే దిద్దినా ఆ ఓటు చెల్లదు.

● బ్యాలెట్‌ పేపర్‌ను బాక్సులో వేయకుండా తీసుకెళ్తే కేసు నమోదు చేస్తారు.

● బాక్సు మధ్యలో మాత్రమే నంబర్‌

రాయాల్సి ఉంటుంది.

● రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన ఊదా రంగు స్కెచ్‌ పెన్నుతో గాక ఇతర ఏ పెన్నులతో రాసినా అది చెల్లుబాటు కాదు.

● ఏ అంకెలు వేయకుండా ఖాళీ బ్యాలెట్‌ పేపర్‌ ఇచ్చినా ఆ ఓటు చెల్లుబాటు కాదు.

రేపు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

ఫ బరిలో ఉన్న 52మంది

అభ్యర్థులందరికీ ఓటు వేయొచ్చు

ఫ ‘1’ప్రాధాన్యత అంకె ఇవ్వకుండా

మిగతావి ఇస్తే ఆ ఓటు చెల్లదు

ఫ అధికారి ఇచ్చిన పెన్నునే

ఉపయోగించాలి

ఓటు వేసే విధానం..

ప్రతి అభ్యర్థికి ఎదురుగా పార్టీ పేరు లేదా స్వతంత్ర అభ్యర్థి అని రాసి ఉంటుంది.

పార్టీల గుర్తులు ఉండవు.

అభ్యర్థి పేరు ఎదురుగా ఖాళీ బాక్స్‌ ఉంటుంది.

పోలింగ్‌ అధికారి ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటరు తన ఓటు వేయాల్సి ఉంటుంది.

అభ్యర్థి పేరు ఎదురుగా ఖాళీ బాక్స్‌లో పెన్నుతో కేవలం నంబర్‌ మాత్రమే వేయాల్సి ఉంటుంది.

ఎమ్మెల్సీ ఓటు వేయండిలా..
1/1

ఎమ్మెల్సీ ఓటు వేయండిలా..

Advertisement
 
Advertisement
 
Advertisement