ప్రేమ విఫలమైంది.. అందుకే చనిపోతున్నా | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమైంది.. అందుకే చనిపోతున్నా

Published Sat, May 25 2024 1:20 PM

ప్రేమ విఫలమైంది.. అందుకే చనిపోతున్నా

గూడూరు: ‘ నాప్రేమ విఫలమైంది. అందుకే చనిపోతున్నా’ అంటూ ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడి ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మచ్చెర్ల శివారు కొమురంభీంనగర్‌ అటవీప్రాంతంలో శుక్రవారం జరిగింది. పోలీసులకు మృతుడి తండ్రి కీర్యానాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. నర్సంపేట డివిజన్‌ ఖానాపురం మండలం నాజీతండాకు చెందిన బాదావత్‌ నవీన్‌ (25) ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ యువతి ఇటీవల నవీన్‌ ప్రేమను కాదంటుండడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను గురువారం ఉదయం నాజీతండా నుంచి బయలుదేరి గూ డూరు మండలం మచ్చెర్ల శివారు కొమురంభీంనగర్‌ అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. తన ప్రేమ విఫలమైందని, అందుకు తాను పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి చెప్పాడు. ఆ తరువాత పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే నాజీతండా నుంచి బయలుదేరి అడవికి చేరుకోగా నవీన్‌ అపస్మారకస్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే గూడూరు సీహెచ్‌సీకి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తండ్రి కీర్యానాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌చేసి ఆత్మహత్య

Advertisement
 
Advertisement
 
Advertisement