రెండు వేర్వేరు కేసుల్లో 8 బైక్‌లు స్వాధీనం

 వివరాలను వెల్లడిస్తున్న  బాపట్ల డీఎస్పీ  
మురళీకృష్ణ, పక్కన వేమూరు సీఐ రామకృష్ణ  - Sakshi

భట్టిప్రోలు: రెండు వేర్వేరు కేసుల్లో చోరీకి గురైన రూ.5.20 లక్షల చేసే ఎనిమిది బైక్‌లు, చోరీకి ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. బాపట్ల డీఎస్పీ టి.మురళీకృష్ణ బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన ఎన్‌హెచ్‌ 216 రహదారిలో ఐలవరం మణికంఠ సప్లయిర్స్‌ వద్ద పెట్టి ఉన్న మోటారు సైకిల్‌ అపహరణకు గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా భట్టిప్రోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 4, కర్లపాలెం, టంగుటూరు పీఎస్‌ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 6 మోటారు సైకిళ్లతో పాటు ఇందుకు ఉపయోగించిన ఇన్నోవా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాకు చెందిన మీరాజోత్‌ ప్రసన్నకుమార్‌ నాయక్‌ రమావత్‌ దుర్గాప్రసాద్‌ నాయక్‌, బాణావత్‌ తులసిబాబు నాయక్‌, బాణావత్‌ హనుమానాయక్‌లను అరె స్టు చేశారు. అలాగే జనవరి 27వ తేదీన ఎన్‌హెచ్‌ 216 రహదారిలో పసుపులేటి రాజేష్‌కు చెందిన పంట పొలం పక్కనే పెట్టిన మోటారు సైకిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి చోరీకి పాల్పడిన నిందితులైన కర్లపాలెం మండలం పెదపులుగవారిపాలెంకు చెందిన శవనం శ్రీనివాసరెడ్డి, వారి మురళీకృష్ణారెడ్డి, భట్టిప్రోలు మండలం ఓలేరు పంచాయతీ పరిధిలోని వెంకట్రాజునగర్‌కు చెందిన దాసరి భరత్‌లను అరెస్టు చేశారు. నిందితులను గురువారం రేపల్లె కోర్టులో హాజరు పరిచారు. వీరిలో ఒకరు మైనర్‌ కాగా గుంటూరులోని జునైల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవ హరించిన భట్టిప్రోలు ఎస్‌ఐ శ్రీనివాసరావు, హెడ్‌ కానిస్టేబుల్స్‌ ఈపూరి వెంకటేశ్వరరావు, సైకం నాగరాజు, గంటా మాధవరావు, తాడివాక వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్‌ క్రాప పుల్లారావు, బేతల అనీల్‌ కుమార్‌, కాటూరి నాగరాజు, హోమ్‌ గార్డు కె.ప్రసాద్‌లను డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు నిమిత్తం బాపట్ల ఎస్పీ కార్యాలయానికి రివార్డ్‌కు ప్రతిపాదన పంపడం జరిగిందని వివరించారు. విలేకరుల సమావేశంలో వేమూరు సీఐ పి.రామకృష్ణ, ఎస్‌ఐ కాసుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చోరీకి ఉపయోగించిన ఇన్నోవా కారు ఏడుగురి నిందితుల అరెస్టు

Election 2024

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top