రోజూ కాఫీ తాగకుండా ఉండలేరా? అయితే ఇది మీకు బెస్ట్‌ ఛాయిస్‌ | Single Serve Coffee Maker Is Best Choice For Travelling Purpose | Sakshi
Sakshi News home page

Single Serve Coffee Maker: ప్రయాణాల్లో చాలా ఈజీ.. సెకన్లలోనే కాఫీ తయారీ

Sep 6 2023 1:11 PM | Updated on Sep 6 2023 2:47 PM

Single Serve Coffee Maker Is Best Choice For Travelling Purpose - Sakshi

యూనివర్సల్‌ డిజైన్‌తో, స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ఇంటీరియర్‌ థర్మల్‌ ట్రావెల్‌ మగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ కాఫీ మేకర్‌..  60 సెకన్లలోపే తాజా కాఫీని తయారు చేస్తుంది. ప్రయాణ సమయాల్లో, ఉదయం లేవగానే.. బిజీ లైఫ్‌ కోసం విలువైన సమయాన్ని ఆదా చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

ఈ స్టైలిష్, కాంపాక్ట్‌ 600 వాట్స్‌ కాఫీ మేకర్‌తో వేడిగా, తాజాగా తయారుచేసిన కాఫీని ఆస్వాదించొచ్చు. వన్‌–టచ్‌ ఆప్షన్‌తో కాఫీ కేఫ్‌ల ముందు గంటల తరబడి వెయిట్‌ చేయాల్సిన కష్టం ఉండదు. ఇది చాలా తక్కువ స్థలం తీసుకుంటుంది.

మన్నికైన మెటీరియల్‌తో రూపొందిన ఈ మేకర్‌ని.. వినియోగించడం చాలా సులభం. కాఫీ క్యాప్సూల్స్‌ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన మినీ బాస్కెట్‌తో పాటు.. కాఫీ పౌడర్‌ వేసుకోవడానికి మినీ ఫిల్టర్‌ ఉంటుంది. దాంతో దీన్ని యూజ్‌ చేయడం చాలా తేలిక. ధర 21 డాలర్లు (రూ.1,737)

Advertisement
 
Advertisement
Advertisement