ప్రపంచంలోనే ఇలాంటి హోటల్‌ ఎక్కడా లేదు.. అంత స్పెషల్‌ ఏంటంటే.. | Intresting Things About Concorde Deluxe Resort In Turkey | Sakshi
Sakshi News home page

Concorde Deluxe Resort: ప్రపంచంలోనే ఇలాంటి హోటల్‌ ఎక్కడా లేదు.. అంత స్పెషల్‌ ఏంటంటే..

Sep 11 2023 4:26 PM | Updated on Sep 11 2023 6:21 PM

Intresting Things About Concorde Deluxe Resort In Turkey - Sakshi

ప్రపంచంలో అక్కడక్కడా కాలంచెల్లిన బోయింగ్‌ విమానాల్లో నడిపే హోటళ్లు ఉన్నాయి. అయితే, టర్కీలో మాత్రం ఏకంగా విమానం ఆకారంలోనే నిర్మించిన విలాసవంతమైన హోటల్‌ ఉంది. ప్రపంచంలో ఇలాంటి హోటల్‌ ఇదొక్కటే! ప్రైవేట్‌ బీచ్, ఒక ‘పెద్దలకు మాత్రమే’ స్విమ్మింగ్‌పూల్‌ సహా నాలుగు స్విమ్మింగ్‌పూల్స్, ఒక ఆక్వా పార్క్‌ ఈ హోటల్‌ ప్రత్యేకతలు.

టర్కీలోని అంతాల్యా నగరానికి చేరువలోని లారా సముద్రతీరం వద్దనున్న ఈ హోటల్‌ పేరు ‘కాంకోర్డ్‌ డీలక్స్‌ రిసార్ట్‌’. అంతాల్యా విమానాశ్రయం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనున్న ఈ హోటల్‌ టర్కీలో పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ హోటల్‌లో పిల్లల ఆటపాటల కోసం ప్రత్యేకమైన కిడ్స్‌ క్లబ్, మినీ గోల్ఫ్‌కోర్స్, టెన్నిస్‌ కోర్ట్‌ తదితరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో విందు వినోదాల కోసం పన్నెండు రెస్టారెంట్లు, పదహారు బార్లు కూడా ఉన్నాయి. ఇద్దరు మనుషులు ఇందులో ఒకరోజు బస చేసేందుకు 73 పౌండ్లు (రూ.7,245) మాత్రమే!  

Advertisement
 
Advertisement
Advertisement