Dua Lipa: ప్చ్‌... ఒక్కరూ గుర్తుపట్టలేదు! | Dua Lipa: A Star Unrecognized in Rajasthan | Sakshi
Sakshi News home page

Dua Lipa: ప్చ్‌... ఒక్కరూ గుర్తుపట్టలేదు!

Jan 7 2024 6:26 AM | Updated on Jan 7 2024 6:26 AM

Dua Lipa: A Star Unrecognized in Rajasthan - Sakshi

సినిమా లేదా టీవీలో నటించే చిన్న ఆర్టిస్ట్‌ కనిపించినా జనాలు చుట్టుముట్టి ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారు. అలాంటిది ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్‌ కనిపిస్తే? ‘జనాలను అదుపు చేయడం కష్టం’ అనుకుంటాం గానీ పాప్‌ సెన్సేషన్‌ దువా లిపా విషయంలో మాత్రం అలా జరగలేదు. సాధారణ పర్యాటకురాలిగా దువా ఇటీవల రాజస్థాన్‌కు వచ్చింది.

సాదాసీదాగా రోడ్లమీద నడుచుకుంటూ వెళుతున్న దువా లిపాను ఒక్కరు కూడా గుర్తు పట్టలేదు. తాను రాజస్థాన్‌లో ఉన్నప్పటి ఫొటోలను ఆమె ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేస్తే వైరల్‌ అయ్యాయి. ‘ఎంత మిస్‌ అయ్యాను. విషయం ముందే తెలిస్తే రెక్కలు కట్టుకొని అక్కడ వాలేవాళ్లం’ అంటూ అభిమానులు భారీగా స్పందించారు. గ్రామీ అవార్డ్‌–విన్నింగ్‌ ఆర్టిస్ట్, గ్లోబల్‌ స్టార్‌ స్టేటస్‌ ఉన్న దువా లిపా మాత్రం తనను ఎవరూ గుర్తించకపోవడాన్ని పెద్ద విషయం అనుకోవడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement