అంబానీ చిన్న కోడలిగా రాధిక మర్చంట్‌, తొలి ఫోటో వైరల్‌ | Anant Ambani Radhika Merchant grand Wedding First Pic goes viral | Sakshi
Sakshi News home page

అంబానీ చిన్న కోడలిగా రాధిక మర్చంట్‌, తొలి ఫోటో వైరల్‌

Jul 13 2024 9:01 AM | Updated on Jul 13 2024 11:46 AM

Anant Ambani Radhika Merchant grand Wedding First Pic goes viral

బిలియనీర్‌  ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, తన ప్రేయసితో వివాహ  బంధంలోకి అడుగుపెట్టాడు.  అత్యంత ఘనంగా నిర్వహించిన పెళ్లి వేడుకలో, సన్నిహితులు, అతిథుల ఆశీర్వాదాల మధ్య అనంత్, రాధిక మర్చంట్ దండలు మార్చుకున్నారు.  ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

 వరుడు తల్లిదండ్రులు,వధువు తల్లిదండ్రులు అనంత్‌ సోదరి ఇషా అంబానీ పిరమల్‌, అంబానీ పెద్ద  కోడలు శ్లోకా మెహతో పాటు, వధువు సోదరి అంజలి మర్చంట్ మజిథియా,తదితరు సన్నిహిత కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలారు.  బాలీవుడ్‌, టాలీవుడ్‌, క్రీడా రంగ ప్రముఖులు, దేశ విదేశాలకు అతిథులు ఈ వేడుకకు మరింత ఆనందోత్సాహాలను జోడించారు. 

 

రియాలిటీ టీవీ స్టార్లు కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్ సందడి చేశారు. ఇంకా  శాంసంగ్‌ చైర్మన్ లీ జే-యోంగ్, బాలీవుడ్  స్టార్లు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్వీకపూర్‌, కత్రినా,  టాలీవుడ్‌ ప్రిన్స్ మహేష్‌ బాబు కుటుంబం, రాంచరణ్‌, సూర్య జ్యోతిక, రాణా అతని భార్య, మాజీ అందాల సుందరి మానుషి చిల్లర్‌, ఇవాంకా ట్రంప్‌ తదితరులు ఈ లిస్ట్‌లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement