చిలక జ్యోతిష్యుడి అవతారం ఎత్తావా ? | Sakshi
Sakshi News home page

చిలక జ్యోతిష్యుడి అవతారం ఎత్తావా ?

Published Thu, May 23 2024 4:35 AM

-

ఏలూరు టౌన్‌: సంక్షేమ పాలనతో దేశానికే ఆదర్శంగా నిలిచి, రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ ఉండి అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు లేదని వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఏలూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచే సత్తా లేని రఘురామకృష్ణరాజు చిలకజోతిష్యుడి అవతారం ఎత్తాడని ఎద్దేవా చేశారు. జూన్‌ 4న ఎన్నికల కౌంటింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాలను వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుంటుందని, ఉండిలో రఘురామకృష్ణరాజు ఓటమి ఖాయమన్నారు. రాజకీయ జీవితం ప్రసాదించిన పార్టీకే వెన్నుపోటు పొడిచావనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పటానికి నువ్వు ఏమైనా దైవాంశసంభూతుడివా అంటూ ప్రశ్నించారు. ఉండి ప్రజల నుంచి రిటర్న్‌ గిఫ్ట్‌ తీసుకునేందుకు రెడీగా ఉండాలన్నారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉండి నియోజకవర్గంలో పార్టీ తరపున అభ్యర్థిగా పీవీఎల్‌ నర్సింహరాజుకు మాండేట్‌ ఇచ్చారనీ, ఆయన పైనే గెలవలేని నువ్వా వైఎస్‌ జగన్‌ను విమర్శించేది అన్నారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి జీవించే క్షత్రియులకు మచ్చతెచ్చేలా అనైతిక రాజకీయాలు చేయటానికి సిగ్గులేదా అని నిలదీశారు. జూన్‌ 4న కౌంటింగ్‌ అనంతరం భవితవ్యం ఏమిటో చూసుకోవాలనీ, వైఎస్సార్‌ సీపీ గురించి, లేదా నాయకుల గురించి అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని ప్రసాదరావు హెచ్చరించారు.

టీడీపీ ఉండి అభ్యర్థి రఘురామపై

వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు

ఘంటా ప్రసాదరావు మండిపాటు

Advertisement
 
Advertisement
 
Advertisement