కూటమికి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు | Sakshi
Sakshi News home page

కూటమికి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు

Published Fri, May 10 2024 6:05 PM

కూటమి

కూటమిలో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓట్లు వేస్తే పరోక్షంగా ముస్లింలకు రిజర్వేషన్ల రద్దును ఒప్పకున్నట్లుగానే భావించాలి. మహానేత వైఎస్సార్‌ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగించారు. దీంతో అనేక మంది ముస్లింలకు ఉపాధి అవకాశాలు లభించాయి. ముస్లింలకు రిజర్వేషన్ల కొనసాగింపునకు సీఎం జగన్‌ కృషి చేయడం అభినందనీయం.

– షేక్‌ చాన్‌బాషా, జిల్లా వక్ఫ్‌బోర్డు సభ్యులు, కలిదిండి

టీడీపీ పాలనలో ఒక్క పదవీ లేదు

టీడీపీ పాలనలో ముస్లిం మైనార్టీ శాఖ కూడా ముస్లింలకు చంద్రబాబు కేటాయించలేదు. జగన్‌ పాలనలో ఉప ముఖ్యమంత్రి, మండలి డెప్యూటీ చైర్మన్‌, నాలుగు ఎమ్మెల్యేలు, నాలుగు ఎమ్మెల్సీ పదవులిచ్చారు. మహానేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని చెప్పారు. ముస్లింలకు వైఎస్సార్‌ సీపీ పాలనలో సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో దక్కాయి.

– ఎండీ.హమీద్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి, కై కలూరు

జగన్‌ ప్రభుత్వంలోనే ముస్లింలకు మేలు

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్‌ అయితే మైనార్టీలను ఆర్థికంగా ఆదుకుంది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. రిజర్వేషన్లు అమలు చేసి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే ముస్లింలకు మేలు జరిగింది. కూటమి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని చెబుతున్నారు. మైనార్టీలంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంటే నడుస్తాం.

– మహ్మద్‌ ఆయూబ్‌ ఖాన్‌, వసంతవాడ, పెదపాడు మండలం

వైఎస్సార్‌ సీపీని గుండెల్లో

పెట్టుకుంటాం

ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తానన్న బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని వైఎస్‌ జగన్‌ చెప్పడం అభినందనీయం. చంద్రబాబు, బీజేపీ, పవన్‌కు మొదటి నుంచి ముస్లింలు అంటే ద్వేషమే. రిజర్వేషన్లు రద్దు చేసి మా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీని ముస్లింలు అంతా గుండెల్లో పెట్టుకుంటారు. ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు వైఎస్సార్‌ సీపీకే ఉంటుంది.

– మహ్మద్‌ జహీర్‌, మాజీ ఎంపీటీసీ, గుండుగొలను

కూటమికి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు
1/3

కూటమికి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు

కూటమికి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు
2/3

కూటమికి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు

కూటమికి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు
3/3

కూటమికి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు

Advertisement
 
Advertisement
 
Advertisement