సామాజిక నీరాజనం | Sakshi
Sakshi News home page

సామాజిక నీరాజనం

Published Sun, Nov 19 2023 1:38 AM

- - Sakshi

శ్రీనివాసా.. గోవిందా..
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి రద్దీ కనిపించింది. తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం కిటకిటలాడాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును వివరిస్తూ చేపట్టిన వైఎస్సార్‌ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు తణుకు ప్రజలు నీరాజనాలు పలికారు. స్వచ్ఛందంగా కదిలి యాత్రకు బ్రహ్మరథం పట్టారు. జగన్‌ ప్రభుత్వం బడుగులకు చేసిన మేలును మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరిస్తుంటే హర్షధ్వానాలు పలికారు. శనివారం తణుకులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అపూర్వ స్పందన వచ్చింది.
విద్యుత్‌ జేఈల బదిలీ

ఆదివారం శ్రీ 19 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

కేసుల పరిష్కారానికి చర్యలు

ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమకుమార్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని న్యాయమూర్తులతో శనివారం కలెక్టరేట్‌లో కేసుల విచారణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కేసుల విచారణ త్వరితగతిన నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై న్యాయమూర్తులకు సూచనలు ఇచ్చారు. వచ్చేనెల 9న జాతీయ లోక్‌ అదాలత్‌లను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల పరిధిలో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి రాజీ ఉత్తమ మార్గమని, లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి.రామగోపాల్‌, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సేవలను చేరువ చేయాలి

ఏలూరు (టూటౌన్‌): ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత చేరువ చేసేలా అధికారులు బాధ్యత వహించాలని శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్‌పర్సన్‌ ఎ.మేరీ గ్రేస్‌కుమారి అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ౖచైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్‌ ఆధ్వర్యంలో స్థానిక న్యాయ సేవా భవన్‌లో శని వారం ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. సభ్యులు కమ్ముల చంద్రశేఖర్‌, ఘంటా రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.శ్రీనివాస్‌ శనివారం సందర్శించారు. సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ఆయన ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు శ్రీవారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. భీమడోలు కోర్టు న్యాయమూర్తి టీఏఎస్‌ఎస్‌ఆర్‌ ఆదిత్య రిషిక్‌ ఉన్నారు.

చెరకు రైతులకు ప్రోత్సాహక ధర

తణుకు: తణుకు ఆంధ్రా సుగర్స్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న తాడువాయి కర్మాగారంలో 2023–24 గానుగాడు రుతువునకు చెరకు రైతులకు ప్రోత్సాహకమైన చెరకు ధరను నిర్ణయించినట్లు ఆంధ్రా సుగర్స్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌, అదనపు సెక్రటరీ పీవీఎస్‌ విశ్వనాథకుమార్‌ తెలిపారు. సంక్రాంతి పండగ ముందు చెరకు సరఫరా చేసే రైతులకు టన్ను ఒక్కంటికి రూ.3,200, సంక్రాంతి తర్వాత చెరకు సరఫరా చేసే రైతుకు టన్నుకు రూ.150 అదనపు ప్రోత్సాహంతో కలిపి టన్నుకు రూ.3,350 చెల్లించేందుకు ధర నిర్ణయించినట్టు తెలిపారు.

భారీగా గంజాయి పట్టివేత

ఏలూరు టౌన్‌: ఏలూరు రూరల్‌ మండలం మల్కాపురం (ఆటోనగర్‌)లో భారీగా గంజా యిని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఏలూరు ఎస్‌ఈబీ టాస్క్‌ఫోర్స్‌ సీఐ కృష్ణధనరాజ్‌, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈబీ సీఐ ప్రసాద్‌కుమార్‌ తమ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టగా ఏపీ 23 టీఏ 0296 నంబర్‌ గల వాహనంలో తరలిస్తున్న సుమారు 196 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరంలోని కృష్ణనగర్‌లో ఉంటున్న బీరక ప్రకాష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.

తణుకులో జన జాతర

సామాజిక సాధికార యాత్రకు అపూర్వ స్పందన

తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు

వెల్లువెత్తిన సామాజిక చైతన్యం

జగన్‌ నినాదాలతో మార్మోగిన సభా ప్రాంగణం

ప్రభుత్వం చేసిన మేలును వివరించిన నేతలు

సాక్షి, భీమవరం/ తణుకు: తణుకులో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు నియోజకవర్గం, పరిసర ప్రాంతా ల నుంచి గోదావరి వెల్లువలా ప్రజలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్‌ నినాదంతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర పట్టణంలో ఘనంగా జరిగింది. తణుకు నియోజకవర్గంతో పాటు పరిసర మండలాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు వేలాదిగా తరలివచ్చారు. శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంశాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎంపీలు నందిగం సురేష్‌, మార్గాని భరత్‌, సినీనటుడు, ప్రభుత్వ సలహాదారుడు (ఎలక్ట్రానిక్‌ మీడి యా) ఆలీ, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు ప్రసంగించారు.

సామాజిక సారథి సీఎం జగన్‌

నాలుగున్నరేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమలుచేసిన పథకాలు.. మాజీ సీఎం చంద్రబాబు వెనుకబడిన, బడుగు బలహీన వర్గాలను వంచించిన తీరును వివరిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపచేశాయి. సంక్షేమ సారథి సీఎం జగన్‌కు అండగా నిలవాల్సిన ఆవశ్యకతకు అద్దం పట్టాయి. అబద్ధాల చంద్రబాబు మాకొద్దంటూ సభికులతో నినాదాలు చేయించారు. తెలుగు దేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చకు రావాలని మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ 2014లో రైతు, డ్వాక్రా రుణమాఫీ తదితర 640కు పైగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలంటూ నాటి మేనిఫెస్టో కాపీలను సభికుల ముందు చింపి పారేశారు. సాధికార యాత్రలపై విషప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను తూర్పారబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే అంత చులకనెందుకంటూ మండిపడ్డారు.

సామాజిక సాధికార బస్సు యాత్ర, సభా కార్య క్రమాల్లో ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్‌, కవురు శ్రీనివాస్‌, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి, శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెండ్ర వీరన్న, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి, టీటీడీ బోర్డు మెంబర్లు మేకా శేషుబాబు, నెరుసు నాగ సత్యం యాదవ్‌, ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్‌, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మంతెన యోగేంద్రకుమార్‌, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో పలువురు జూనియర్‌ ఇంజనీర్లను బదిలీ చేస్తూ ఆ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎ.రవికుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పి.కోటేశ్వరరావు (చింతలపూడి)ని దర్బగూడెం, సాధనాల విజయకుమార్‌ (కొవ్వూరు)ను పోలవరం, బి.శ్రీనివాసరావు (పాలకొల్లు)ను మొగల్తూరు, వంగపండు శ్రీనివాసరావు (ఏలూరు)ను రంగాపురం, దండు రమేష్‌బాబు (కేశవరం)ను నీలాద్రిపురం, పాకలపాటి శ్రీనివాస్‌ (ద్వారకాతిరుమల)ను కామవరపుకోట, మద్దాల రూపకిషోర్‌ (చిట్యాల)ను గొల్లగూడెం, రుద్రరాజు రవీంద్రవర్మ (నిడమర్రు)ను ఆకివీడు రూరల్‌, మన్నెం రామారావు (పోడూరు)ను ఆచంట, కె.నరేంద్రబాబు (పెదవేగి)ను ఏలూరు, గూడూరి జేజే నాగరాజు (కాటకోటేశ్వరం)ను పెనుగొండకు బదిలీ చేశారు. అలాగే గుండుబోగుల హరిబాబు (లక్ష్మీపురం)ను రాఘవాపురం, నెక్కంటి విజయభాస్కర్‌ (తోగుమ్మి)ను దేవరపల్లి, దూది మునివెంకట ప్రసాద్‌ (ఏలూరు నార్త్‌ సెక్షన్‌)ను ద్వారకాతిరుమల, సయ్యద్‌ బాజీ (అంబర్‌పేట)ని టి.నరసాపురం, ఎస్‌.వెంకట సత్యసాయి (తాడేపల్లిగూడెం సౌత్‌ సెక్షన్‌)ని నరసాపురం రూరల్‌, ఏలూరు డివిజన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ద్వారకాతిరుమల జూనియర్‌ ఇంజనీర్‌ ఎం.విజయలక్ష్మిని పవర్‌పేటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ : 89776 25795

న్యూస్‌రీల్‌

సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో..

ముఖ్య సమాచారం అవగాహన సదస్సు తేదీ: నవంబర్‌ 25, 2023(శనివారం) వేదిక టీటీడీ కల్యాణ మండపం, ఆర్‌టీసీ బస్టాండ్‌ దగ్గర, ఏలూరు. సమయం ఉదయం 09:30 నుంచి 12:30 వరకు

1/3

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ కుమార్‌
2/3

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ కుమార్‌

న్యాయమూర్తి శ్రీనివాస్‌కు జ్ఞాపిక అందిస్తున్న ఏఈఓ దుర్గారావు
3/3

న్యాయమూర్తి శ్రీనివాస్‌కు జ్ఞాపిక అందిస్తున్న ఏఈఓ దుర్గారావు

Advertisement

తప్పక చదవండి

Advertisement