తీర్పు భద్రం.. భవిత గోప్యం | Sakshi
Sakshi News home page

తీర్పు భద్రం.. భవిత గోప్యం

Published Wed, May 15 2024 4:20 AM

తీర్ప

బుధవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2024

భద్రతా చర్యలను

పరిశీలించిన కలెక్టర్‌

ముమ్మిడివరం: శ్రీనివాస ఇంజినీరింగ్‌ కాలేజిలో డాక్టర్‌ బీఆర్‌ ఆంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియ అనంతరం ఈవీఎంలు, పోలింగ్‌ సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద భద్రతా చర్యలను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షుశుక్లా పరిశీలించారు. ఇంజినీరింగ్‌ కశాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రంలో నియోజకవర్గాల వారీగా వాహనాలలో పోలింగ్‌ సిబ్బంది తీసుకుని వచ్చిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, పోలింగ్‌ సామగ్రి స్వీకరణ స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రతా ఏర్పాట్ల ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. అయా రిటర్నింగ్‌ అధికారుల పరిశీలన అనంతరం అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను, పోలింగ్‌ సామగ్రిని పోలింగ్‌ సిబ్బంది ద్వారా స్వీకరించి వారికి కేటాయించిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చారు.

అనంతరం రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో ఆయా స్ట్రాంగ్‌రూమ్‌లకు సీల్‌ వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రివెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, రిటర్నింగ్‌ అధికారులు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. నుపూర్‌ అజయ్‌, జి.కేశవరెడ్డి, జీవీవీ సత్యనారాయణ, ఏ.శ్రీరామచంద్రమూర్తి, డీవీఎస్‌ ఎల్లారావు, వి.మదన్‌మెహన్‌రావు, ఎస్‌.సుధాకర్‌, ఏఆర్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు

లెక్కలతో పార్టీల కుస్తీ

మహిళలు.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓటింగ్‌తో అధికార పార్టీలో ధీమా

జిల్లాలో అర్ధ రాత్రి వరకు పోలింగ్‌

తెల్లవారు జామున స్ట్రాంగ్‌ రూమ్‌కు

ఈవీఎంలు

సాక్షి అమలాపురం: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లపై ఇప్పుడు అందరి దృష్టి. స్వారత్రిక ఎన్నికల ఓటింగ్‌ పూర్తవడంతో అభ్యర్థుల జాతకాలను ఈవీఎంలు తేల్చనున్నాయి. వారి రాజకీయ భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల అనుకున్న నాటి నుంచి సోమవారం రాత్రి పోలింగ్‌ ముగిసే వరకు వ్యయప్రయాలకు లోనై... తమ శక్తి యుక్తులన్నింటినీ ధారబోసి తలపడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితం కోసం జూన్‌ 4 వరకు ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు ఈవీఎంలలో తమకు పడిన ఓట్లపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటూ గడపాల్సిందే. మరోవైపు ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరాయి.

నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల సంగ్రామంలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలోకి చేరింది. పోలింగ్‌ ముగిసినా అభ్యర్థులలో హైరానా తగ్గలేదు. పట్టణాలలో వార్డులు, గ్రామాల వారీగా తమకు పడిన ఓటింగ్‌పై లెక్కల తీసేపనిలో బీజీగా ఉన్నారు. పురుషులు, మహిళలు, యువత, వృద్ధులు, కూలాలు, మతాల వారీగా తమకు పడిన అనుకూల ఓటింగ్‌పై లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామాలు, మండలాల వారీగా లెక్కలు వేసుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు, మెజార్టీలపై అంచనాలకు వస్తున్నారు. మహిళా ఓటింగ్‌ పెరగడం ప్రతి పక్ష టీడీపీ, జనసేన పార్టీలలో గుబులు రేపుతోంది. వీరితోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మరీ ముఖ్యంగా పింఛన్‌దారులు పెద్ద ఎత్తున ఓటింగ్‌కు వచ్చారు. ఉత్సాహంగా ఓటు వేశారు. ఇవన్నీ తమకు ప్రతికూలంగా మారుతాయని వారు భయపడుతున్నారు. గ్రామీణ ఓటరు పోటెత్తడంతో అధికార పార్టీ అభ్యర్థులలో గెలుపుపై ధీమా పెంచింది.

స్ట్రాంగ్‌ రూమ్‌కు ఈవీఎంలు

సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్‌ ప్రక్రియ జిల్లాలో ఆలస్యమైంది. అంచనాలకు మించి ఓటర్లు రావడం, కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్‌ సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దీంతో ఈవీఎంలను చేర్చడం సోమవారం రాత్రి కుదరలేదు. పోలింగ్‌ పూర్తయిన తరువాత కాట్రేనికోన మండల పరిధిలోని చెయ్యేరులో ఉన్న శ్రీనివాస ఇంజినీరింగ్‌ కాలేజీకి ఈవీఎంలు చేర్చారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి విధుల నుంచి బయటకు వచ్చేసరికి పోలింగ్‌ సిబ్బందికి తెల్లవారింది. మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఈవీఎంల తరలింపు చోటు చేసుకుంది. ఓటింగ్‌ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తినా ఓటింగ్‌కు సమయం సరిపోలేదు. మధ్యాహ్న సమయంలో ఎండ కారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్న ఓటర్లు సాయంత్రం పోటెత్తారు. దీంతో ఆరు గంటల సమయంలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి వరుసలో నిలుచున్న వారికి కూపన్లు ఇచ్చి అధికారులు ఓటింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఓటర్లు అధికంగా ఉన్నచోట ఓటింగ్‌ రాత్రి పద కొండు గంటల వరకు సాగింది.

జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి వినియోగించిన ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరాయి. పోలింగ్‌ ముగిసిన తరువాత సెక్టార్ల వారీగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, పోలింగ్‌ సామగ్రి కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పరిధిలోని శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలకు చేరుకున్నాయి. ఇక్కడ మూడంచల భద్రతను కల్పించారు.

పార్లమెంట్‌ పరిధిలో 83.84 శాతం పోలింగ్‌ :

ఓటువేసిన 12,84,008 మంది

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోమవారం నిర్వహించిన పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. అమలాపురం పార్లమెంట్‌ పరిధిలో మొత్తం 15,31,410 మంది ఓటర్లు ఉండగా, 12,84,008 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ 83.84 శాతంగా నమోదయ్యింది. గత ఎన్నికలతో సమానంగా ఓటింగ్‌ పడింది. పార్లమెంట్‌ పరిధిలో పురుషుల ఓట్లు 7,59,104 కాగా, 6,44,189 మంది (84.86 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7,72,285 మంది మహిళా ఓట్లకు గాను 6,39,808 మంది (82.84 శాతం) ఓటు వేశారు. పార్లమెంట్‌ పరిధిలో పురుషులు కన్నా మహిళా ఓట్లు అధికంగా ఉన్నా ఓటింగ్‌లో మాత్రం పురుషులు అధికంగా పాల్గొన్నారు. ఇక పార్లమెంట్‌ పరిధిలో ఇతర ఓట్లు 21 మంది కాగా 11 మంది (52.38 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అత్యధికంగా ఓట్లు వేసిన నియోజకవర్గం కొత్తపేటలో 2,14,975 మంది ఓట్లు వేయగా, ఓటింగ్‌ శాతం మండపేటలో 87.06 శాతం (1,91,959 ఓట్లు) నమోదయ్యింది.

సోషల్‌ మీడియాలో కవ్విస్తే కఠిన చర్యలు

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు

ఎస్పీ శ్రీధర్‌

అమలాపురం టౌన్‌: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగిన నేపథ్యంలో ఎవరైనా సోషల్‌ మీడియా ఆధారంగా పోస్టింగ్‌లతో కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్‌ హెచ్చరించారు. సోషల్‌ మీడియా ద్వారా లేని పోని అలజడులు సృష్టించినా, ప్రోత్సహించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సోమవారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్ర పరిచినట్లు ఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. ఆ స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎస్పీ శ్రీధర్‌ మంగళవారం మరోసారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడు అంచెలుగా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచామని ఎస్పీ పేర్కొన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద బందోబస్తు, సోషల్‌ మీడియా ద్వారా జరుగుతున్న రెచ్చగొట్టే ప్రచారాలపై ఎస్పీ శ్రీధర్‌ ఈ సందర్భంగా మాట్లాడారు.

ఓటింగ్‌ జరిగింది ఇలా..

నియోజకవర్గం మొత్తం ఓటు వేసిన ఓటు వేసిన ఓటు వేసిన మొత్తం ఓటింగ్‌

ఓటింగ్‌ పురుషులు మహిళలు ఇతరులు ఓటర్లు శాతం

రామచంద్రపురం 2,03,207 87,429 86,487 1 1,73,917 85.59

ముమ్మిడివరం 2,45,296 1,03,951 1,01,212 0 2,05,163 83.64

అమలాపురం 2,13,508 89,007 86,837 1 1,75,845 82.36

రాజోలు 1,97,920 77,351 79,048 1 1,56,400 79.02

పి.గన్నవరం 1,98,602 84,467 81,279 3 1,65,749 83.46

కొత్తపేట 2,52,383 1,07,762 1,07,210 3 2,14,975 85.18

మండపేట 2,20,494 94,222 97,735 2 1,91,959 87.06

తీర్పు భద్రం.. భవిత గోప్యం
1/1

తీర్పు భద్రం.. భవిత గోప్యం

Advertisement
 
Advertisement
 
Advertisement