గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి | Man dies egg stuck in throat | Sakshi
Sakshi News home page

గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి

Nov 4 2024 4:30 AM | Updated on Nov 4 2024 4:30 AM

Man dies egg stuck in throat

లింగాల: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాలలో చోటుచేసు కుంది. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌ గ్రామానికి చెందిన ఉప్పరి తిరుపతయ్య (55) ఆదివారం లింగాల మండలంలోని అప్పాయ పల్లిలో బంధువుల ఇంటికి వచ్చాడు. లింగాలలో ఉన్న బజ్జీల బండి దగ్గర ఉడకబెట్టిన గుడ్డు తీసుకున్నాడు. 

అప్పాయపల్లి వెళ్లే మార్గంలో ఉన్న కమాన్‌ దగ్గర కూర్చొని గుడ్డు తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందాడు. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం బంధువులకు సమాచారం అందించి వారికి మృతదేహాన్ని అప్పగించారు. తిరుపతయ్య భార్య లక్ష్మమ్మ మూడేళ్ల క్రితం మృతిచెందగా ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement