బంగారం, వెండి ధరలు ఈ వారం బాగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 9 నుంచి 16 వరకు పసిడి వెండి ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,710 నుంచి రూ.1,47,440కు పడిపోయింది. దీంతో తులంపై రూ.3,270 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,38,150 నుంచి రూ.1,35,150కు దిగివచ్చింది. అంటే 10 గ్రాములపై రూ.3,000 తగ్గింది.
మరోవైపు, వెండి ధర కూడా తగ్గింది. అక్టోబర్ 9న హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, అక్టోబర్ 16 నాటికి రూ.2,40,000కు చేరింది. దీంతో కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. అయితే, అక్టోబర్ 17న బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోగా, వెండి ధర కిలోకు రూ.2,40,000 వద్దే కొనసాగింది.
ఈ తగ్గుదలతో పండుగల సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. అయితే, అక్టోబర్ 17న హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,660కు, 22 క్యారెట్ల ధర రూ.1,35,350కు స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, బాండ్లపై రాబడుల్లో మార్పులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


