Weekly Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.. | Weekly Horoscope From 01-09-2024 To 07-09-2024 In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది..

Sep 1 2024 4:30 AM | Updated on Sep 1 2024 4:30 AM

Weekly Horoscope From 01-09-2024 To 07-09-2024 In Telugu

మేషం..
కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనులలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు సైతం సహకరించడం విశేషం. ఆత్మీయులు  చేదోడుగా నిలుస్తారు. ప్రతిభను చాటుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. బంధువులతో సఖ్యత ఏర్పడతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. శ్రమపడ్డా ఫలితం శూన్యం. ఎరుపు, తెలుపు రంగులు,  గణపతి ఆరాధన మంచిది.

వృషభం..
పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. ప్రత్యర్థులను మార్చడంలో సఫలమవుతారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.   వాహనయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. తెలుపు, గులాబీ రంగులు, విష్ణుధ్యానం చేయండి.

మిథునం..
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో కలహాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  పాతమిత్రులను కలుసుకుంటారు.  గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. నలుపు, నేరేడురంగులు,  గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం..
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.  వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తుల కలలు ఫలిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం..
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి.  పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు,గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం  ప్రారంభంలో దుబారా వ్యయం. మానసిక అశాంతి. ఎరుపు, గులాబీ రంగులు, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

కన్య..
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు.  ఆలయాలు సందర్శిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు.  కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు  శ్రమ కలిసివస్తుంది. కళాకారుల నిరీక్షణ ఫలిస్తుంది.  వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు,  వేంకటేశ్వరస్తోత్రాలు పఠించండి.

తుల..
ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తల కృషి సఫలమవుతుంది. వారం మధ్యలో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు,  శివనామ స్మరణ మంచిది.

వృశ్చికం..
కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత.  బంధువులతో సఖ్యత నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఊహించని పదోన్నతులు. టెక్నికల్‌ రంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు,  ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు..
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. శ్రమ తప్పదు. ఎరుపు, లేత పసుపు రంగులు,  దుర్గామాతను పూజించండి.

మకరం..
అనుకున్న ఆదాయం లభిస్తుంది.  కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు.  ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.  గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో వృథా ఖర్చులు. సోదరులతో కలహాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు,  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం..
ముఖ్య కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. సమాజంలో ఆదరణ లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విశేషంగా కలిసివస్తుంది. రాజకీయవేత్తల కలలు ఫలించే సమయం. వారం చివరిలో  స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు,   శివాలయం దర్శించండి.

మీనం..
ముఖ్య నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. బాకీలు కొన్ని అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.  ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి.   వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. రాజకీయవర్గాలకు  ఉత్సాహం పెరుగుతుంది.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Advertisement
 
Advertisement
Advertisement