యువకుడిపై ట్రాఫిక్‌ పోలీసుల అమానుషం! | Traffic Police Brutality: Andhra pradesh | Sakshi
Sakshi News home page

యువకుడిపై ట్రాఫిక్‌ పోలీసుల అమానుషం!

Dec 29 2024 5:37 AM | Updated on Dec 29 2024 5:37 AM

Traffic Police Brutality: Andhra pradesh

నడిరోడ్డుపై బూటుకాళ్లతో తన్ని తరిమేశారు 

జనం చూస్తుండగానే బండబూతులతో దాడి 

ఆపై యువకుడిపైనే కేసు నమోదు

అనంతపురం: మఫ్టీలో ఉండి చలానాలు ఎందుకు రాస్తున్నారు.. అని ప్రశ్నించిన ఓ యువ­కుడిపై అనంతపురం ట్రాఫిక్‌ పోలీసులు జు­లుం ప్రదర్శించారు. యువకుడిని తీవ్రంగా కొ­ట్టారు. అనంతపురం నగరం నడిబొడ్డున టవ­ర్‌క్లాక్‌ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘట­నపై పలు విమర్శలు వ్యక్తమవుతు­న్నా­యి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, వాహనా­ల తని ఖీలను ముమ్మరం చేశారు. టవర్‌క్లాక్‌ వద్ద శుక్రవారం రాత్రి త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న ఓ వాహనాన్ని ఆపారు. ముగ్గురు యువకులకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేశారు.

త్రిబుల్‌ రైడింగ్‌తో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్నట్టు గుర్తించారు. బైక్‌ను తీసుకెళ్లి.. రేపు స్టేషన్‌కు వచ్చి తీసుకోవాలని యువకులతో పోలీసులు చెప్పారు. ఇంతలోనే మఫ్టీలో ఉన్న ఒక పోలీ­సు వారితో దురుసుగా ప్రవర్తించాడు. మఫ్టీలో ఉంటూ తమపై చలానాలు రాయడమేంటని యువకుడు ప్రశ్నించడంతో.. ఆగ్రహించిన నలు­గురు పోలీసులు  యు­వ­కుడిని బూటు కాళ్లతో తన్నారు. పత్రికల్లో రాయలేని భాషలో తిడుతూ.. తీవ్రంగా కొట్టి ఇంటికి పంపారు.  ఇదిలా ఉండగా యువకుడిపై పోలీసులు దాడి చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడు­తు న్నారు. దీంతో ఉలిక్కిపడ్డ ట్రాఫిక్‌ కానిస్టే­బుళ్లు సురేష్, రమేష్, రాజేష్, సురేంద్రకుమా­ర్‌­బాధిత యువకుడిపైనే కేసు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement