రెండో విడత మెడికల్‌ పీజీ సీట్ల కేటాయింపు | Second phase of medical PG seat allocation | Sakshi
Sakshi News home page

రెండో విడత మెడికల్‌ పీజీ సీట్ల కేటాయింపు

Dec 20 2024 5:43 AM | Updated on Dec 20 2024 5:43 AM

Second phase of medical PG seat allocation

నేటి నుంచి పీజీ తరగతులు 

సాక్షి, అమరావతి: 2024­–25 విద్యా సంవత్సరా­నికి పీజీ మెడికల్‌ రెండో దశ కన్వీనర్, యాజమా­న్య కోటా సీట్లను ఆరో­గ్య విశ్వవిద్యాలయం గురువారం కేటాయించింది. సీట్లు పొందిన వైద్యులు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్‌ చేయా­లని ఆదేశించింది. 

ఈ మేరకు ప్రతి కళాశాలలో ప్రిన్సిపాల్‌ అధ్యక్షతన ఇద్దరు లేదా ముగ్గురు ప్రొఫెసర్‌లతో కమిటీలను ఏర్పాటుచేసి ఆయా కాలేజీల్లో చేరే వైద్యుల ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి సూచించారు. ముఖ్యంగా స్థానికత, రిజర్వేషన్‌ల వారీగా నీట్‌ కటాఫ్‌ స్కోర్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement