ఏపీలో వైద్య సేవలు అమోఘం | Medical services in AP are excellent | Sakshi
Sakshi News home page

ఏపీలో వైద్య సేవలు అమోఘం

Sep 21 2023 3:29 AM | Updated on Sep 21 2023 3:29 AM

Medical services in AP are excellent - Sakshi

తాడేపల్లిరూరల్‌: ఏపీలోని డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వైద్య సేవలు అమోఘంగా ఉన్నాయని నేషనల్‌ హెల్త్‌ రీసోర్స్‌ సెంటర్‌ నుంచి వచ్చిన బృంద సభ్యులు డాక్టర్‌ ఎస్‌.వినోద్‌­కుమార్, మొహమ్మద్‌ షేక్‌లు కితాబిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్‌­నగర్‌ డ్రైవర్‌ కాలనీలో బుధవారం డాక్టర్‌ వైఎ­స్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను వారు సందర్శించారు. వైద్యశాల ఆధ్వర్యంలో అందిస్తున్న సేవ­లను వివరించేందుకు ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.

ముందుగా గర్భిణులకు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికా­హారాన్ని, పోషక విలువలను అడిగి తెలుసుకుని.. చాలా అమోఘంగా ఉందని ప్రశంసించారు. అ­నం­తరం వైద్యశాలలో కుష్టు వ్యాధికి, ఇతర దీర్ఘ­కాలిక వ్యాధులకు అందిస్తున్న చికిత్సతో పాటు, రోగులకు ఇస్తున్న కౌన్సెలింగ్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వైద్య సేవలు చాలా బాగున్నాయన్నారు.

కార్పొరేట్‌ ఆస్ప­త్రులకు దీటుగా అన్ని వసతులను ఏర్పాటు చేశారని కొనియాడారు. ప్రతి ఆస్పత్రిలో ఇన్‌పే­షెంట్‌ సౌకర్యం కూడా కల్పించారని, అన్ని రకాల రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు చేస్తున్నారని చెప్పా­రు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఉప ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మన్మోహన్, తాడేపల్లి ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ కిరణ్‌కుమార్, డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యుడు డాక్టర్‌ మానస తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement