Live Updates
ముద్రగడకు వైఎస్సార్‌సీపీ నేతల నివాళి
విలువలకు కట్టుబడిన నాయకుడు ముద్రగడ
- ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం తెలిపిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడిన నేతలు
- తన్నీరు నాగేశ్వరరావు కామెంట్స్..
- ముద్రగడ మరణం వైఎస్సార్‌సీపీకి తీరని లోటు
- విలువలకు కట్టుబడి రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి
- పదవుల కన్నా ప్రజా సేవే గొప్పదని భావించిన నాయకుడు
- కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఉద్యమ నేత
- ఆయన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం
ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్
- ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్
- ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్
- అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కిర్లంపూడిలోనే వైఎస్ జగన్
- ముద్రగడ ఇంటి ఆవరణలో అంత్యక్రియలు
ముద్రగడకు వైఎస్సార్‌సీపీ నేతల నివాళి
- కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసానికి వైఎస్సార్‌సీపీ నాయకులు
- ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేశ్,
- మాజీ ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.
జోగి రమేష్ కామెంట్స్:
ముద్రగడ ముక్కు సూటితనం తో నిక్కర్చిగా మాట్లాడేవారు
ఎవరితో అయినా తాను అనుకున్నది చెప్పగలరు
నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు అనారోగ్యంగా ఉన్నా.. నా ఇంటికి వచ్చి ముద్రగడ నాకు ధైర్యం చెప్పారు
ముద్రగడకు వైఎస్ జగన్ నివాళి
- కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ జగన్
- ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
- ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా
ముద్రగడ నివాసానికి వైఎస్ జగన్
కాకినాడ జిల్లా కిర్లంపూడి చేరుకున్న వైఎస్ జగన్
ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్న వైఎస్ జగన్
గొప్ప ఉద్యమకారుడిని కోల్పోయాం
- ముద్రగడకు నివాళి అర్పించిన స్టీల్ ప్లాంట్ యూనియన్ నేతలు
- స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏ ఉద్యమానికైనా సిద్దమని ముద్రగడ చెప్పారు
- స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున నివాళి అర్పించాం
- గొప్ప ఉద్యమకారుడిని కోల్పోయాం
- నీరుకొండ రామచంద్రరావు, ఉక్కు పోరాట కమిటీ నేత
ముద్రగడ నివాసానికి అంబటి రాంబాబు
- కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు, ఆయన కుమార్తె మౌనిక.
- ముద్రగడ మరణం ఆయన కుటుంబానికే కాదు, యావత్ రాష్ట్రానికి తీరని లోటు: అంబటి మౌనిక
- ఇచ్చిన మాటకు నిలబడి, నమ్మిన దాని కోసం ఎంత దూరమైన వెళ్లిన నాయకుడు ముద్రగడ
- అవినీతికి తలవంచకుండా ఆయన చేసిన పోరాటం అందరికీ సూర్ఫిదాయకం
- మానవీతకు పెద్దపీట వేసి కాపు ఉద్యమాన్ని నడిపిన తీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి
ప్రభుత్వాలను ఎదిరించి నిలిచిన ధీశాలి: వెలంపల్లి
- విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ముద్రగడ పద్మనాభం సంతాప సభ
- ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కార్యకర్తలు
- మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్
- చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా సేవలందించిన గొప్ప నేత ముద్రగడ
- ప్రభుత్వాలను ఎదిరించి నిలిచిన ధీశాలి ముద్రగడ
- ఎక్కడా కాంప్రమైజ్ కాని మనస్తత్వం ఆయనది
- కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడపై గతంలో అక్రమ కేసులు బనాయించారు
- అప్పట్లో ముద్రగడను పలకరించడానికి వచ్చిన చిరంజీవి, దాసరి నారాయణరావులను ఎయిర్‌పోర్ట్ నుంచే వెనక్కి పంపడం వాస్తవం కాదా?
- కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్, ముద్రగడకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడటం లేదు
- ముద్రగడ పద్మనాభం ఆశయాలు, ఆలోచన విధానాన్ని వైఎస్సార్‌సీపీ ముందుకు తీసుకెళ్తుంది
తిరుపతి ఎంపీ సంతాపం
- కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి తిరుపతి ఎంపీ గురుమూర్తి సంతాపం
- ఎంపీ గురుమూర్తి కామెంట్స్..
- కాపు సామాజిక వర్గం కోసమే కాదు.. అన్ని వర్గాలు నేతగా ముద్రగడ ప్రజాసమస్యలపై పోరాటం చేశారు
- ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు
- కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను
- పోకల అశోక్ కుమార్ నివాళి
బైరాగిపట్టేడ వద్ద ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులు అర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్
ప్రేమ, ఆప్యాయతకు ప్రతిరూపం: జక్కంపూడి రాజా
- సాక్షి టీవీతో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..
- ముద్రగడ మరణం తీరని లోటు..
- ప్రేమ, ఆప్యాయతకు ప్రతిరూపం ముద్రగడ
- ఆయనతో మా అనుబంధం మర్చిపోలేనిది
- ముద్రగడ అధికారం వెంట పరిగెత్తె వ్యక్తి కాదు
- ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని ముద్రగడ కుటుంబ సభ్యులు తెలిపారు
- పద్మనాభం గారిని అనేక రకాలుగా వేధించి అవమానించారు
- ముద్రగడ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు
- ముద్రగడ చనిపోయాక వారి ముసలి కన్నీరు అవసరం లేదు
మంత్రుల నివాళి
- కిర్లంపూడిలో ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్
ముద్రగడ ఆశయాలను ముందుకు తీసుకెళతాం
- తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో ముద్రగడ పద్మనాభం సంతాప సభ
- ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు
- ముద్రగడకు లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, శ్యామల, మంచా మల్లేశ్వరి, కార్యకర్తల నివాళి
- ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
ముద్రగడ పద్మనాభం విలక్షణమైన నేత
కాపు ఉద్యమంలో ముద్రగడ ప్రముఖ పాత్ర పోషించారు
ముద్రగడ లేని లోటు రాష్ట్రానికి, వైఎస్సార్‌సీపీకి తీరనుది
ముద్రగడ ఆశయాలను ముందుకు తీసుకెళతాం
- మాజీ ఎమ్మెల్యే, గడికోట శ్రీకాంత్ రెడ్డి
ముద్రగడ సీనియర్ రాజకీయవేత్త
తన జీవితాంతం రాజీలేనిపోరాటం చేశారు
ముద్రగడ ఆశయాలను ముందుకు తీసుకెళతాం
ముద్రగడ కుటుంబానికి వైసిపి అండగా ఉంటుంది
- మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
ఎమ్మెల్యేగా,మంత్రిగా,ఎంపీగా పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి ముద్రగడ
ప్రజా ఉద్యమం, కాపు ఉద్యమంలో వెనకడుగు వేయలేదు
చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడను ఆయన కుటుంబాన్ని ఎంతో వేధించారు
ఇచ్చిన హామీని నెరవేర్చమని అడిగినందుకు ఇబ్బంది పెట్టారు
ముద్రగడ లేని లోటు తీరనిది
ముద్రగడ ఆశయాలను, పోరాటాన్ని ముందుకు తీసుకెళతాం
- మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
కాపు ఉద్యమ నేతగా నీతి నిజాయితీలకు కట్టుబడ్డ నాయకుడు ముద్రగడ
ముద్రగడ మరణం అందరినీ కలచివేసింది
ఏ ప్రభుత్వంలో ఉన్నా కాపుల కోసం పోరాడారు
ఏపీ రాజకీయాల్లో ముద్రగడ చెరగని ముద్ర వేసుకున్నారు
ముద్రగడ కుటుంబానికి అమ్మవారు మనోధైర్యాన్ని ఇవ్వాలి
ముద్రగడ ఆశయాలను కొనసాగిస్తాం
- ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినాని అవినాష్
ముద్రగడ ఎంతో మంచి మనసున్న వ్యక్తి
ఎవరు తన ఇంటికి వెళ్లినా మంచి ఆతిథ్యం ఇచ్చేవారు
ఆయన లేని లోటు తీర్చలేనిది
ముద్రగడ ఆశయాలను ముందుకు తీసుకెళతాం
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల
ముద్రగడ కాపు గొంతుకై నిలిచారు
ముద్రగడ ఆలోచనలను వైసిపి పార్టీ ముందుకు తీసుకెళుతుంది
అదే ముద్రగడకు అసలైన నివాళి
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మంచా మల్లేశ్వరి
మా తరానికి ముద్రగడ ఒక స్పూర్తి
ఆయన బాటలో నడుస్తాం కేంద్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గారికి వైఎస్సార్‌సీపీ నేతలు ఘన నివాళులు అర్పించారు. pic.twitter.com/f8lkaapeKu
— Devineni Avinash (@DevineniAvi) July 15, 2026
కాపు కులానికి తీరనిలోటు: దేవినేని అవినాష్
- విజయవాడ: మాజీమంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులర్పించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, వైఎస్సార్‌సీపీ నాయకులు
- దేవినేని అవినాష్ పాయింట్స్
- ముద్రగడ పద్మనాభం మృతి కాపు కులానికి తీరనిలోటు
- కాపు కుల అభ్యున్నతికి పోరాడిన మహాయోధుడు ముద్రగడ పద్మనాభం
- నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంటు సభ్యులుగా, మంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన మహా వ్యక్తి
- కష్టమని చెప్పి తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి తన వారిగా అనుకుని న్యాయం చేసిన వ్యక్తి ముద్రగడ
- ముద్రగడ చూపిన బాటలు అనుసరణీయం
- ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను
అనకాపల్లిలో సంతాప సభ
- అనకాపల్లి జిల్లా వైఎ స్సార్‌సీపీ కార్యాలయంలో దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ
- ముద్రగడ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి వైఎ స్సార్‌సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, మహిళా నేతలు ఈర్లే అనురాధ, లోచల సుజాత, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య
ముద్రగడ మరణం తీరని లోటు: అంజాద్ బాషా
- మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై వైఎస్సార్‌సీపీ నేతల సంతాపం
- కడప వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ముద్రగడ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
- ముద్రగడ పద్మనాభం సేవలను గుర్తు చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నాయకులు
- ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్న అంజాద్ బాషా
- రెండు నిమిషాల మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
అవనిగడ్డలో..
- కృష్ణాజిల్లా: అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముద్రగడకు నివాళి
- ముద్రగడ్డ పద్మనాభం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పంచాయతీరాజ్ విభాగ జిల్లా అధ్యక్షులు సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ నేతలు
ముద్రగడ విగ్రహాలు ఏర్పాటు చేయాలి: పురందేశ్వరి
- ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
- ఎంపీ పురందేశ్వరి కామెంట్స్
- కులమతాలకతీతంగా ముద్రగడ అన్నీ వర్గాల ప్రజలకు సేవలు అందించారు
- ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలి
- మా తండ్రి ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది
- ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
చిర్ల జగ్గిరెడ్డి నివాళులు
- కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
- జిల్లా రావులపాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మృతికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంతాపం
- చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా అధ్య చిర్ల జగ్గిరెడ్డి
ఉద్యమ నేతకు నివాళులు
- కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నాయకులు, అభిమానులు నివాళులు
- కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి తరలివస్తున్న నాయకులు


