మొదటి సెషన్‌ కంటే సులభమే! | JEE Main second session exams begin | Sakshi
Sakshi News home page

మొదటి సెషన్‌ కంటే సులభమే!

Apr 3 2025 5:53 AM | Updated on Apr 3 2025 5:53 AM

JEE Main second session exams begin

జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు ప్రారంభం

జనవరితో పోల్చితే ఈసారి సులభ ప్రశ్నలు

కెమిస్ట్రీ కఠినం... ఫిజిక్స్‌ ఓ మాదిరి

గణితంలో సాగదీత ప్రశ్నలు తగ్గుదల

ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కే ప్రాధాన్యం

పాత పేపర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు

తొలి రోజు పరీక్ష ప్రశాంతం

సాక్షి, ఎడ్యుకేషన్‌: జేఈఈ మెయిన్‌–2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొ­లి­రోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశా­రు. ఈసారి అడిగిన ప్రశ్నల్లో భిన్నత్వం కనిపించిందని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. మొదటి సెషన్‌లో రసాయన శాస్త్ర ప్రశ్నలు తేలికగా ఉంటే, ఈసారి కఠినమైన ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. న్యుమరికల్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు చెప్పా­రు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ లోంచి ప్రశ్నలను ట్విస్ట్‌ చేస్తూ ఇచ్చినట్టు నిపుణులు వెల్లడించారు.

సాధారణంగా ఫిజిక్స్‌లో మధ్యస్తంగా స్కోర్‌ చేసేందుకు అ­వకాశం ఉండేది. ఈసారి మాత్రం కెమెస్ట్రీతో పోలిస్తే ఫిజిక్స్‌ విభాగంలో కొంత సులభమైన ప్రశ్నలున్న­ట్టు నిపుణులు తెలిపారు. గణితంలో ఈసారి సుదీర్ఘ ప్రశ్నలు కొంత తగ్గినట్లు అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో లాగరిథమ్స్, క్వాడ్రాట్రిక్‌ ఈక్వేషన్స్, సీక్వెన్స్‌ అండ్‌ సిరీస్‌ల నుంచి వచ్చిన ప్రశ్నలకు తేలికగానే సమాధానాలు రాబట్టినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. 

సబ్జెక్టులవారీగా ఇలా..
» మొదటి షిఫ్ట్‌ ప్రశ్నపత్రం ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని, ఫిజిక్స్‌ విభాగం క్లిష్టంగా, మ్యాథమెటిక్స్‌ విభాగంలో ప్రశ్నలు సుదీర్ఘంగా, మిగతా రెండు విభాగాలతో పోల్చితే కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. 
» ఫిజిక్స్‌లో మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, ఆ­ప్టిక్స్‌ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. 
» కెమిస్ట్రీలో ఈసారి ఓ మోస్తరు క్లిష్టతతో ప్రశ్నలడిగారని అంటున్నారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కంటే ఇనార్గానిక్, ఫిజికల్‌ కెమిస్ట్రీ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోంచి నేరుగా అడిగారు. 
» మ్యాథమెటిక్స్‌ విభాగంలో జనవరి సెషన్‌తో పోల్చితే ఈసారి ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని, 5 ప్రశ్నలు డైరెక్ట్‌ ఫార్ములా ఆధారంగా అడిగారని చెబుతున్నారు.

గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా..
రెండో సెషన్‌లో మొదటి రోజు పరీక్షల్లో అధిక శాతం ప్రశ్నలు.. గత ప్రశ్న పత్రాల నుంచే అడిగారు. వీటిని బాగా ప్రాక్టీస్‌ చేసిన వారు ఎక్కు­వ సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది. ఫా­ర్ములాలు, కాన్సెప్ట్‌లపై అవగాహన ఉన్నవారు కూడా సమాధానాలు ఇచ్చేలా ప్రశ్నలున్నాయి. కెమిస్ట్రీలో మిక్స్‌డ్‌ కాన్సెప్ట్‌ కొశ్చన్స్‌ అడిగారు. మ్యాథమెటిక్స్‌లో 52–56 మార్కులు; ఫిజిక్స్‌లో 75–85 మార్కులు; కెమిస్ట్రీలో 60–65 మా­ర్కులతో 99 పర్సంటైల్‌ పొందే అవకాశం ఉంది. – ఎం.ఎన్‌. రావు, జేఈఈ శిక్షణ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement