బంగాళాఖాతంలో వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు | heavy rain forecast for andhra pradesh | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Dec 20 2024 1:49 PM | Updated on Dec 21 2024 7:08 PM

heavy rain forecast for andhra pradesh

సాక్షి,విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. విశాఖపట్నంనకు 640 కిలోమీటర్ల దూరంలో,చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.  వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 

వాయుగుండం ఏర్పడి వాతావరణం అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ తీరంలో మత్స్య కారులు వేట నిషేధం విధించింది. కళింగపట్నం , విశాఖ, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

Advertisement
 
Advertisement
Advertisement