ఈ గొప్ప విజయం ప్రజలది | CM Jagan Comments On YSRCP Solid victory in AP municipal elections | Sakshi
Sakshi News home page

ఈ గొప్ప విజయం ప్రజలది

Mar 15 2021 3:11 AM | Updated on Mar 15 2021 8:11 AM

CM Jagan Comments On YSRCP Solid victory in AP municipal elections - Sakshi

సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గొప్ప విజయం ప్రజలదని వినమ్రంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘‘ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వాతాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది.

ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయపడతాను’’ అని పేర్కొన్నారు. విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement