27 నుంచి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

27 నుంచి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌

Published Fri, May 24 2024 6:45 AM

27 ను

అనంతపురం/కళ్యాణదుర్గం: పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ ను ఈ నెల 27 నుంచి నిర్వహించనున్నట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సి. జయచంద్రా రెడ్డి, కౌన్సెలింగ్‌ అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం. రామకృష్ణా రెడ్డి, కళ్యాణదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఎస్‌ శ్రీధర్‌ కుమార్‌ తెలిపారు.అనంతపురం,తాడిపత్రి, కళ్యాణదుర్గం, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. ఈ నెల 24 (నేడు) నుంచి జూన్‌ 2 వరకు appolycet.nic.in వెబ్‌సైట్‌లో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 రుసుం చెల్లించి రసీదును పొందాలన్నారు.

ఆప్షన్ల ఎంపిక...

జూన్‌ 5 నుంచి ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కళాశాలలో సీట్ల కేటాయింపు జూన్‌ 7న జరుగుతుంది. విద్యార్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు తీసుకు రావాలి.

విద్యార్థులు తీసుకువాల్సిన పత్రాలు...

● కౌన్సెలింగ్‌ ఫీజు (ప్రాసెసింగ్‌ ఫీజు) రసీదు

● ఏపీ పాలీసెట్‌ హాల్‌టికెట్‌

● పాలీసెట్‌ ర్యాంక్‌ కార్డు

● 10వ తరగతి మార్కుల జాబితా (ఒరిజినల్‌ లేదా నెట్‌ కాపీ)

● 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు

● ఓసీ కేటగిరీ వారికి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ 2024–25 ఏడాదికి సంబంధించి..

● ఇన్‌కం సర్టిఫికెట్‌ (01.01.2021 నుంచి)

● కులం సర్టిఫికెట్‌

● ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ)

27 నుంచి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌
1/1

27 నుంచి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement