17న రైతు సంఘం జిల్లా మహాసభ | Sakshi
Sakshi News home page

17న రైతు సంఘం జిల్లా మహాసభ

Published Fri, Dec 1 2023 1:04 AM

చెక్కు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వ - Sakshi

అనంతపురం అర్బన్‌: ఈ నెల 17, 18 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలను నిర్వహించనున్నట్లు ఆ సంఘం వర్కింగ్‌ అధ్యక్షుడు మల్లికార్జున తెలిపారు. రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనేలా చేసి, సభల జయప్రదానికి కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్‌ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి చెందితే రైతులు సంతోషంగా ఉంటారన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలన్నారు. రైతుల సమస్యల సాధనకు రైతు సంఘం అనునిత్యం పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు 2024 జనవరి 4, 5 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నప్ప, నాయకులు వన్నారెడ్డి, నరసింహులు, మనోహర్‌, రాము, మధుయాదవ్‌, వెంకటరాముడు, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ

కూడేరు: ఐదు నెలల క్రితం బ్రెయిన్‌స్ట్రోక్‌తో మృతి చెందిన కూడేరు మండలం ముద్దలాపురానికి చెందిన మండ్లి రమేష్‌ యాదవ్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం సహాయ నిఽధి నుంచి మంజూరైన రూ.2.75లక్షలను చెక్కు రూపంలో గురువారం ఉదయం రమేష్‌ భార్య సావిత్రికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సీపీ వీరన్న, సర్పంచ్‌ ధనుంజయయాదవ్‌, ముద్దలాపురానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేతలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు మల్లికార్జున
1/1

మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు మల్లికార్జున

Advertisement

తప్పక చదవండి

Advertisement