జీవనోపాధి మెరుగుపడింది | Sakshi
Sakshi News home page

జీవనోపాధి మెరుగుపడింది

Published Fri, Dec 1 2023 1:04 AM

- - Sakshi

మా నాన్న జిలాన్‌ వెల్డింగ్‌ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. నేను డిగ్రీ వరకూ చదువుకున్నా. ఉద్యోగ ప్రయత్నాల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఎడమ చెయ్యి విరిగింది. విషయం తెలుసుకున్న ఆరోగ్యమిత్ర బాబు మా ఇంటి వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుని 2020లో అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి శస్త్రచికిత్స చేయించారు. నయాపైసా ఖర్చు లేకుండా నాకు నయమయ్యేలా చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ సేవలను మరిచిపోలేను. ప్రస్తుతం వెల్డింగ్‌ పనులతో జీవనోపాధిని మెరుగుపరుచుకున్నా. ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందుతున్నా.

– ఎస్‌.గౌస్‌మొద్దీన్‌, పామిడి

ఆర్థిక ఇబ్బందులు తీరాయి

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం అలేబాదు గ్రామంలో మా ఆయన పేరిట రెండు ఎకరాల పొలం ఉండేది. పంటలు సరిగ్గా పండక 15 సంవత్సరాల క్రితం యాడికి గ్రామానికి వలస వచ్చాం. మగ్గం పని నేర్చుకున్నాం. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారింది. జగనన్న ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు ఆర్థిక సాయం అందుతోంది. మా పొలాన్ని కౌలుకు ఇవ్వడంతో ఏటా రూ.10వేలు వస్తోంది. ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా లబ్ధి చేకూరుతోంది. ఈ మొత్తం డబ్బును మా ఆయన పెట్టుబడి పెట్టి చీరల వ్యాపారం మొదలు పెట్టారు. అమ్మ ఒడి పథకంతో మా రెండో కుమారుడిని విజయవాడలో ఇంటర్‌ చదివిస్తున్నాం. పెద్ద కుమారుడికి దీవెన పథకాల లబ్ధి చేకూరింది. దీంతో కర్నూలులో డిప్లొమా 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇప్పుడు మా కుటుంబానికి ఎలాంటి సమస్యలూ లేవు. ఆర్థిక ఇబ్బందులూ తీరాయి.

– లక్ష్మీదేవి, ఆస్పత్రి కాలనీ, యాడికి

లక్షాధికారిని చేశారు

ఇళ్లలో పనులు చేసుకుని కుటంబాన్ని పోషించుకుంటున్న మాకు సొంతిల్లు కూడా లేదు. ఇంటి అద్దెలో కట్టలేక సతమతమయ్యేవాళ్లం. కొడుకు ఆటో నడపడం ద్వారా వచ్చే సంపాదనతో ఏ పూటకాపూట గడిచిపోయేది. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత మా బతుకులు బాగుపడ్డాయి. గార్లదిన్నె రైల్వే స్టేషన్‌ ప్రక్కన నా పేరుతో స్థలం మంజూరు చేసి, ఇల్లు కూడా కట్టించారు. ఇప్పుడా ఇల్లు రూ.లక్షల విలువ చేస్తోంది. నన్ను లక్షాధికారిని చేశారు. ఆర్థిక ఇబ్బందులు తీరాయి. సీఎం వైఎస్‌ జగన్‌కు మేమెంతో రుణపడి ఉన్నాం. – ప్రమీల, గార్లదిన్నె

పేదరికం దూరమవుతోంది

నా భర్త శ్రీనివాసులు గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జగనన్న ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి, దీవెన పథకాల ద్వారా మా ఇద్దరు పిల్లలు కళ్యాణి, కిశోర్‌ ఉచితంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. మా కుమార్తె ఇంటర్‌ చదివేటప్పుడు రెండేళ్లు అమ్మఒడి, డిగ్రీ చేరాక జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిచేకూరింది. మా బాబు కూడా ప్రస్తుతం బీటెక్‌ చేస్తున్నాడు. ఈ పథకాల ద్వారా దాదాపు రూ.90 వేల వరకూ లబ్ధి పొందాం. జగనన్న సాయమందించకపోతే పిల్లల చదువులు భారమయ్యేవి. అప్పుల పాలయ్యేవాళ్లం. జగనన్న చేదోడు పథకం ద్వారా ఏటా రూ.10 వేల చొప్పున నాలుగుసార్లు లబ్ధి పొందాను. వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.18,750 చొప్పున మూడుసార్లు లబ్ధి చేకూరింది. నిజం చెప్పాలంటే జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలతో మా పేదరికం దూరమవుతోంది.

– సి.పార్వతి, గంగానగర్‌, గుంతకల్లు

1/4

2/4

3/4

4/4

Advertisement

తప్పక చదవండి

Advertisement