హోరెత్తిన ఎన్నికల ప్రచారం | Sakshi
Sakshi News home page

హోరెత్తిన ఎన్నికల ప్రచారం

Published Fri, May 10 2024 7:10 PM

హోరెత

చింతపల్లి రూరల్‌: మండలంలో లంబసింగి, తాజంగిలో వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి, పాడేరు అసెంబ్లీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు గురువారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి తమను గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మోసపూరిత హామీలను నమ్మి మళ్లీ మోసపోవద్దని సూచించారు. తాజంగిలో పాడేరు జిల్లా నియోజకవర్గ పరిశీలకులు శ్రీకాంత్‌రాజు సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరికి అభ్యర్థులు తనూజారాణి, విశ్వేశ్వరరాజు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, సర్పంచులు కొర్ర శాంతి కుమారి, మహేశ్వరి, గెమ్మిల లలిత, మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి, వైస్‌ ఎంపీపీలు శారద, వెంగళరావు, కోఅప్షన్‌ నాజర్‌వలీ, ట్రైకార్‌ డైరెక్టర్‌ లోవరాజు, జిల్లా పార్టీ యువజన విభాగ కమిటీ కార్యదర్శి మత్స్యరాజు, మాజీ వైస్‌ ఎంపీపీ బూసరి కృష్ణ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

లంబసింగి, తాజంగిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార ర్యాలీ

భారీగా తరలివచ్చిన జనం

టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన కుటుంబాలు పార్టీలో చేరిక

హోరెత్తిన ఎన్నికల ప్రచారం
1/1

హోరెత్తిన ఎన్నికల ప్రచారం

Advertisement
 
Advertisement
 
Advertisement